ఆర్జీవీకి కొత్త ట్యాగ్ బ‌యోల‌జీ స‌ర్

Update: 2022-02-03 16:30 GMT
ఈ మ‌ధ్య రామ్ గోపాల్ వ‌ర్మ ఏ చిన్న విష‌యాన్ని కూడా వ‌ద‌ల‌డం లేదు. త‌న‌కు అనుకూలంగా వుంటే ప్ర‌తీ విష‌యాన్ని ట్వీట్ చేస్తున్నారు. లేదా ఎవ‌రో చేసిన ట్వీట్ న‌చ్చితే రీ ట్వీట్ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. అయితే గ‌త కొంత కాలంగా వివాదాస్ప‌ద అంశాల‌కే అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్న రామ్‌ గోపాల్ వ‌ర్మ తాజాగా ఓ సెన్సిబుల్ ట్వీట్ ని పోస్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఈ ట్వీట్ కున్న మ‌రో విశేషం ఏంటంటే ఈ ట్వీట్ లో టాలీవుడ్ మోస్ట్ క్రేజీ స్టార్ డైరెక్ట‌ర్ల‌ని కూడా యాడ్‌చేయ‌డం.

వ‌ర్మ షేర్ చేసిన ఓ ఫొటోలో త‌న‌తో పాటు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ల‌కు ఓ ట్యాగ్ వుండటం విశేషం. ప్ర‌తీ స్టార్ డైరెక్ట‌ర్ కి ఓ స‌బ్జెట్ ని క‌రెక్ట్ గా మ్యాచ్ చేసిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్  రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్, పూరి జ‌గ‌న్నాథ్‌, బోయ‌పాటి శ్రీ‌ను, సుకుమార్‌, కొర‌టాల శివల‌ని ఒక్కో స‌బ్జెక్ట్ ల‌తో పోలుస్తూ అందులో వీరు ఎక్స్ ప‌ర్ట్ ల‌ని చూపించిన తీరు బాగుంది.

హిస్టారిక‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు రాజమౌళిని హిస్ట‌రీ మాస్ట‌ర్‌గా, తెలుగు డైలాగ్ ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచి మాట‌ల మాంత్రికుడిగా పేరున్న‌ త్రివిక్ర‌మ్ తెలుగు మాస్ట‌ర్‌గా, రొమాంటిక్ యాక్ష‌న్ చిత్రాల్లో హీరో, హీరోయిన్ ల మ‌ధ్యదిరిపోయే కెమిస్ట్రీని పండించే పూరి జ‌గ‌న్నాథ్ కెమిస్ట్రీ మాస్ట‌ర్ గా, ఇక యాక్ష‌న్ చిత్రాలతో ఆక‌ట్టుకునే ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ని ఫిజిక్స్ మాస్ట‌ర్ గానూ,..

త‌న సినిమాలో ప్ర‌తీ విష‌యాన్ని లెక్క‌ల్లో చూపించే లెక్క‌ల మాస్టారు సుకుమార్ ని మ్యాథ్స్ మాస్ట‌ర్ గానూ, సోష‌ల్ ఇష్యూస్ ని త‌న సినిమాల్లో ఎక్కువ‌గా చూపించే కొర‌టాల శివ‌ని సోష‌ల్ మాస్ట‌ర్ గానూ, ఇక ఎక్క‌డ అమ్మాయి వుంటే త‌న‌ని ఎంత గ్లామ‌ర్ గా చూపించాలో అంత గ్లామ‌ర్ గా చూపిస్తూ వైర‌ల్ చేసే ద‌ర్శ‌కుడిగా పేరున్న రామ్ గోపాల్ వ‌ర్మ‌ని బ‌యోల‌జీ మాస్ట‌ర్ గానూ చూపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది.

మొత్తానికి వ‌ర్మ త‌న‌కు కావాల్సిన ట్యాగ్ ని తాను తీసుకుని స్టార్ డైరెక్ట‌ర్ లు రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, పూరి జ‌గ‌న్నాథ్‌, బోయ‌పాటి శ్రీ‌ను, సుకుమార్‌, కొర‌టాల శివల‌కు సూట‌య్యే ట్యాగ్ ల‌ని ఇచ్చేసిన తీరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే ఈ ట్వీట్ కు 600 మంది కామెంట్ చేయ‌గా, రెండు వేల పై చిలుకు మంది రీ ట్వీట్ చేయ‌గా... 24 వేల మంది లైక్ చేశారు, 
Tags:    

Similar News