రాజమౌళి-రామారావు-రామ్ చరణ్ రేర్ కాంబినేషన్ లో తెరకెక్కిన RRR ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో రికార్డ్ బ్రేకింగ్ స్క్రీన్లలో విడుదలవుతోంది. అక్కడ వసూళ్ల పరంగా మరో నైజామ్ ని మించి పోవడం ఖాయమన్న చర్చ సాగుతోంది. అలాంటిది రచ్చ గెలిచి ఇంట ఓడిన చందంగా ఏపీలో ఆర్.ఆర్.ఆర్ సన్నివేశం వేరుగా ఉండనుందని విశ్లేషిస్తున్నారు. ఇటీవల టికెట్ పై రూ.70 వరకూ పెంపును ఏపీలో అనుమతించినా కానీ బెనిఫిట్ షోలు ఎక్స్ ట్రా షోలు లేకపోవడంతో ఆ మేరకు ఆర్.ఆర్.ఆర్ ఆరంభ వసూళ్లకు పంచ్ పడనుంది.
ఆంధ్రప్రదేశ్ -తెలంగాణలో ప్రీమియర్ లను రద్దు చేశారనేది తాజా గుసగుస. ప్రీమియర్ ల రద్దు వెనుక కచ్చితమైన కారణం ఏమిటో వెల్లడి కాలేదు కానీ.. RRR పంపిణీదారులు ముందస్తు చెల్లింపు ప్రీమియర్ ల అవకాశాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. దానికి బదులుగా వారు ఎర్లీ షోల ప్రతిపాదనకు వెళ్లినట్లు గుసగుస వినిపిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 25న ఉదయం 4 గంటల నుంచి RRR షోలు ప్రారంభమవుతాయి.
అయితే పెయిడ్ ప్రీమియర్ ల కోసం అభిమానులు ఆసక్తిగా లేరా? అంటే ఎందుకు లేరు. అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రీమియర్స్ తో జంట తెలుగు రాష్ట్రాల్లో RRR థియేట్రికల్ వసూళ్లను పెంచుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ తాజా పరిణామాలు వేరుగా ఉన్నాయి. ఈ చిత్రానికి ఎలాంటి చెల్లింపు ప్రీమియర్లు ఉండవని గుసగుస వినిపిస్తోంది.
ఈ ఐదు రోజుల్లో టీమ్ RRR విశ్వవ్యాప్త ప్రచారానికి సిద్ధమవుతోంది. రాజమౌళి- రామ్ చరణ్- రామారావు మరో నాలుగైదు రోజుల పాటు భారతదేశంలోని మెట్రోలు సహా అనేక ప్రధాన నగరాల్లో పర్యటించి సినిమాను ప్రమోట్ చేయనున్నారు. బాహుబలి ముందు కూడా ఇలానే వరుస పర్యటనలతో రాజమౌళి అండ్ టీమ్ బోలెడంత ప్రచారం చేయడం కలిసొచ్చింది. ఇప్పుడు అదే తీరుగా మరోమారు రాజమౌళి టీమ్ టూర్లు ఉంటాయి. ఇప్పటికే స్థానిక తెలుగు మీడియాలకు ఆర్.ఆర్.ఆర్ టీమ్ కావాల్సినంత ఫీడ్ ఇచ్చి బయల్దేరుతోంది.