నటసింహా నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. `అఖండ` ఘనవిజయం సాధించాక బాలయ్య స్పీడ్ మరింత పెంచారు. ఆయన తదుపరి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో భారీ మాస్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే అనీల్ రావిపూడి కథకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.
అంతేకాదు బాలయ్య - రావిపూడి సినిమాపై వస్తున్న గాసిప్స్ తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో ఎన్.బి.కే తో పాటుగా మరో హీరో కూడా నటిస్తున్నారని వరుస కథనాలు వెబ్ లో వేడెక్కించాయి. కానీ అలాంటిదేమీ లేదని బాలయ్య సోలో హీరోగా కనిపిస్తారని తాజాగా వెల్లడించారు. తాను బాలయ్యను దృష్టిలో ఉంచుకునే కథను రాసుకున్నానని అతడు వెల్లడించారు.
మే 27న అనీల్ రావిపూడి తెరకెక్కించిన `ఎఫ్ 3` ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వేసవిలో మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. కడుపుబ్బా నవ్వుకునేందుకు పక్కా ఫార్ములాతో రావిపూడి తెరకెక్కించారు. సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. మరోవైపు నిర్మాణానంతర పనులపైనా దృష్టి సారించారు.
మలినేనితో జెట్ స్పీడ్ గా..
ఇప్పటికిప్పుడు వరుసగా మూడు నాలుగు ప్రాజెక్టులు బాలయ్య క్యూలో ఉన్నాయి. ఏప్రిల్ 18 నుంచి గోపిచంద్ మలినేనితో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇది 45 రోజులు సుదీర్ఘ షెడ్యూల్. ఈ భారీ షెడ్యూల్ లో మెజారిటీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేస్తారు. ముఖ్యంగా బాలయ్య పోర్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ పూర్తి చేసేస్తారట. ఆ తర్వాత ఎన్.బి.కే తన తదుపరి చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడితో ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తారు. మొత్తానికి రావిపూడితో ప్రాజెక్ట్ కోసం గోపిచంద్ మలినేనికి డెడ్ లైన్ విధించారని అర్థమవుతోంది.
తదుపరి ఆదిత్య 369 సీక్వెల్ కోసం అనీల్ రావిపూడికి కూడా డెడ్ లైన్ విధిస్తారనే టాక్ ఉంది. ఎన్.బి.కే నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం ఇప్పటి నుంచే బాలయ్య భారీ ప్లానింగ్ తో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ తనకు ఎంతో కీలకమైనది. తనయుడిని స్వీయ దర్శకత్వంలో లాంచ్ చేయాలన్న ఆలోచన కూడా బాలయ్య కు ఉంది. మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ గురించి బోలెడంత చర్చ సాగింది. ఆదిత్య 369 సీక్వెల్ లో అతడు నటిస్తాడని బాలయ్య అతిథిగా కనిపిస్తారని.. `ఆదిత్య 999 మ్యాక్స్` అనే టైటిల్ ఫిక్స్ చేశారని కూడా ప్రచారమైంది. ఈ మూవీ ఎన్.బి.కే లైఫ్ లోనే స్పెషల్ మూవీ కానుందని సమాచారం.