బన్నీ కాకుండా బోయపాటి మైండ్‌ లో ఎవరున్నారు..?

Update: 2022-04-04 10:32 GMT
'అఖండ' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి శ్రీను మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుందా అని చాలా రోజులుగా చర్చలు జరుగుతుండగా.. ఉస్తాద్ హీరో రామ్ పోతినేనితో బోయపాటి ఇటీవలే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.

నిజానికి అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను ఓ మూవీ చేయాల్సి ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'సరైనోడు' సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే మాస్ డైరెక్టర్ మరో ప్రాజెక్ట్ చేయడానికి కమిట్ అయ్యారు.

'పుష్ప' పార్ట్-1 రిలీజైన తర్వాత 'బన్నీ - బోయపాటి' సినిమాని సెట్స్ మీదకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే 'పుష్ప: ది రైజ్' మూవీ అంచనాలకు మించి విజయం సాధించడం.. అల్లు అర్జున్ కు పాన్ ఇండియా వైడ్ క్రేజ్ రావడంతో ప్లాన్స్ చేంజ్ అయ్యాయి.

ముందుగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' పార్ట్-2 చిత్రాన్ని పూర్తి చేయాలని బన్నీ నిర్ణయించుకున్నారు. దీంతో బోయపాటి మరో ఏడాదిన్నర పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ తో మూవీ ప్రకటించారు.

తర్వాత అయినా బన్నీతో బోయపాటి ఓ సినిమా చేయాల్సి ఉంటుంది. 'పుష్ప 2' తర్వాత సహజంగానే అల్లు అర్జున్ మైండ్ లోకి వస్తాడు. కాకపోతే బోయపాటి పాన్ ఇండియా స్థాయిలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

#BOTAPATIRAPO చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. ఇది బోయపాటి కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. కాకపోతే దర్శకుడి ఆలోచనలు ఇప్పటి వరకు లోకల్ అండ్ మాస్ ఆడియన్స్ కే పరిమితం అయ్యాయి. ఇప్పుడు రామ్ తో పవర్ ఫుల్ మాస్ అండ్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఈ సినిమా సక్సెస్ అయితే అల్లు అర్జున్ తో కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథతో సినిమా చేయాల్సి ఉంటుంది. బన్నీ కాకుండా బోయపాటి శ్రీను మైండ్‌ లో వేరే స్టార్ హీరో ఎవరైనా ఉన్నారేమో చెప్పలేం. నందమూరి బాలకృష్ణతో 'అఖండ 2' చేస్తానని ఇది వరకే ప్రకటించారు. తమిళ హీరో సూర్యతో సినిమా చేయాలని ఆశ పడుతున్నారు. మరి రామ్ తర్వాత బోయపాటి ఏ హీరోని ఎంచుకుంటారో చూడాలి.
Tags:    

Similar News