బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకున్న హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రి. ఈ అమ్మడు రాక్ స్టార్ అనే సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమా తోనే ప్రతి ఒక్కరితో వావ్ అనిపించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత హాట్ బ్యూటీగా మరింత రెచ్చి పోయింది. తన ప్రతి సినిమా తో కూడా ఈ అమ్మడు ప్రేక్షకులను అలరించింది.
కేవలం హీరోయిన్ గానే కాకుండా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటూ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ మోస్ట్ బ్యూటీ అండ్ హాట్ సుందరి కశ్మీరి బిజినెస్ మెన్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని ఆమె ఇన్నాళ్లు నిర్థారించలేదు అలాగే కొట్టి పారేయలేదు. తాజాగా ఆ విషయం పై నర్గీస్ స్పందించింది.
మనిషి అన్నప్పుడు ప్రేమలో పడకుండా ఉండరు. నేను కూడా అందుకు మినహాయింపు కాదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ప్రేమలో ఉందా లేదా అనే విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పకుండానే సమాధానం దాటవేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన బాడీ షేమింగ్ పై వచ్చిన వార్త కథనాలకు మరియు సోషల్ మీడియా కామెంట్స్ కు చాలా ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఇండియాకు వచ్చిన సమయంలో చాలా సన్నగా ఉండటం వల్ల కాస్త బరువు పెరగాలంటూ కొందరు సూచించారు. ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం నేను కాస్త బరువు పెరిగాను. ఆ సమయంలో నన్ను చాలా మంది అసభ్యంగా కామెంట్స్ చేశారు. నేను బరువు పెరిగిన సమయంలో కొందరు ఏకంగా ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేయడం తో పాటు మీడియా వారు కూడా ప్రచారం చేశారు.
ఆ విషయం నాకు చాలా బాధను కలిగించింది. ప్రతి ఒక్క సమయంలో కూడా నాకు నేను చాలా నమ్మకంను చెప్పుకుంటూ కెరీర్ లో నిలదొక్కుకుంటూ వచ్చాను. బరువు మళ్లీ తగ్గినప్పుడు కూడా ఏవో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో నేను నా ఆరోగ్యం గురించి.. నా కెరీర్ గురించి బరువు తగ్గడం పెరగడం చేశాను. ఆ విషయం లో ఎవరు ఏం అన్నా కూడా నేను పట్టించుకోవద్దు అనుకున్నాను అంది. తెలుగు లో ఈమె హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.