రాజ‌మౌళిపై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్‌

Update: 2022-03-31 11:30 GMT
రీసెంట్ గా విడుద‌లైన ట్రిపుల్ ఆర్ యావ‌త్ దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. క‌నీ వినీ ఎరుగ‌ని స్థాయిలో వ‌రుస రికార్డుల్ని త‌రిగ‌రాస్తూ స‌రికొత్త సంచ‌ల‌నాల దిశ‌గా ప‌య‌నిస్తోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఈ భారీ మ‌ల్టీస్టార్ మూవీ మ‌న దేశంలోనే కాకుండా ఇత‌ర దేశాల్లోనూ మ‌రీ ముఖ్యంగా ఆమెరికాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కాలిఫోర్నియాలో ప‌లువురు ఫారిన‌ర్స్ ఈ సినిమా మేనియాకు పిచ్చెక్కిపోతున్నారు.

మునుపెన్న‌డూ ఈ స్థాయి ఇండియ‌న్ సినిమాని చూడ‌లేద‌ని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కొంత మందేమో బాలీవుడ్ సినిమాల‌ని ప‌క్క‌న పెట్టి సౌత్ ఇండియ‌న్ సినిమాలే చూడాల‌నుకుంటున్నాని కామెంట్ లు చేస్తుంటే మ‌రి కొంత మంది ఇప్ప‌టికే నాలుగు సార్లు ఈ మూవీని చూశానని, మీరు కూడా చూసి అనుభూతిని పొందండ‌ని ట్వీట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో యుఎస్ లో ఈ మూవీ ఓ రేంజ్ లో అక్క‌డి వారి విశేష ఆద‌ర‌ణ‌తో రికార్డులు సృష్టిస్తోంది.

ఇదిలా వుంటే ట్రిపుల్ ఆర్ సృష్టిక‌ర్త ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ మూవీ రిలీజ్ సంద‌ర్భంగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో పాటు, రాజ‌మౌళిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మూవీ చిత్రీక‌ర సంద‌ర్భంగా సినిమా కోసం ఎంత క‌ఠోరంగా శ్ర‌మించారో, రాజ‌మౌళి విజ‌న్‌, అండ్ ప‌ర్ ఫెక్ష‌న్ గురించి వెల్ల‌డించారు.

నా కెరీర్ గురించి చెప్పాల్సి వ‌స్తే ట్రిపుల్ ఆర్ కి ముందు త‌రువాత అని చెప్పాల్సి వుంటుంది. భీమ్ అత్యంత బ‌ల‌వంతుడైన అడ‌వికి రారాజు. అంతే కాకుండా చాలా ఇన్నోసెంట్‌. జంతువుల‌తో నా ఎపిసోడ్ గురించి రికార్డ్ చేసిన ఓ వీడియోపై ప్రేక్ష‌కుల స్పంద‌న చూసి మ‌తిపోయింది నాకు. అప్పుడు  అనిపించింది రాజ‌మౌళి ఆడియ‌న్స్ ప‌ల్స్ ని ఎలా ప‌ట్టేస్తున్నాడా? అని. ఒక్కో వ‌ర్గానికి ఒక్కో విధమైన అభిరుచి వుంటుంది అయితే అలాంటి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని త‌న సినిమాల‌తో ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు.

ఈ మూవీ విష‌యంలో చాలా బాధ్య‌త‌తో భ‌యంతో మా బెస్ట్ ని ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాం. ఈ మూవీ బాహుబ‌లిని క్రాస్ చేస్తుందా అంటే నాకు ఆ ఐడియా లేదు. అత్యంత శ‌క్తిని ధార‌పోసి ఈ మూవీతో బెస్ట్ కంటెంట్ ని అందించే ప్ర‌య‌త్నం చేశాం. అది ఏ స్థాయి విజ‌యాన్ని సాధిస్తుంద‌న్న‌ది ప్రేక్ష‌కులే నిర్ణ‌యించాలి. ఓ స‌న్నివేశంలో మ‌ళ్లీ మ‌ళ్లీ టేక్ అని అడుగుతుంటే రాజ‌మౌళితో సీజీలో క‌రెక్ట్ చేసుకోవ‌చ్చు క‌దా? అన్నాను. కానీ తను విన‌లేదు. ఎందుకంటే ఆయ‌నొక పెర్ ఫెక్ష‌నిస్ట్‌. పులితో ఫైట్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ ని చాలా డీటైల్డ్ గా చెప్పాడు. త‌ను చెప్పిన దాన్ని ఫాలో కావ‌డ‌మే న‌టుడిగా నా బాధ్య‌త అదే నేను చేశాను. అయితే సినిమా రిలీజ్ కి ముందు రాజ‌మౌళి మారు చూపించ‌లేదు` అని షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు ఎన్టీఆర్‌.
Tags:    

Similar News