ఈ ఫ్రైడే 'టీఎఫ్ ఐ'కి విష‌మ ప‌రీక్షేనా?

Update: 2022-06-21 13:30 GMT
క‌రోనా కార‌ణంగా చాలా వ‌ర‌కు సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. వ‌న్స్ ప‌రిస్థితులు అనుకూలంగా మార‌డంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ బాక్సాఫీస్ పై దండ‌యాత్ర చేసిన విధంగా రికార్డు స్థాయి సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేశాయి.ఇందులో పాన్  ఇండియా మూవీస్ వున్నాయి. స్టార్ హీరోల సినిమాలు వున్నాయి.. మినిమ‌మ్ బ‌డ్జెట్ మూవీస్ వున్నాయి. ఇందులో ఎ్కువ‌గా ప్రేక్ష‌కుల్ని పాన్ ఇండియా మూవీస్ మాత్ర‌మే ఆక‌ట్టుకున్నాయి. దీంతో వాటిని చూడటానికే అత్య‌ధికంగా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చారు.

అయితే మిగ‌తా సినిమాల‌కు మాత్రం ఆద‌ర‌ణ క‌రువ‌వుతూ వ‌స్తోంది. దీంతో చాలా వ‌ర‌కు చిన్న సినిమాలు, స్టార్స్ మూవీస్‌, టైర్ టు హీరోస్ మూవీస్ బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌లేక పోతున్నాయి. గ‌తంలో మామూలు సినిమాకు కూడా థియేట‌ర్లు నిండేవి కానీ ప్ర‌స్తుతం అలా జ‌ర‌గ‌డం లేదు. చాలా వ‌ర‌కు థియేట‌ర్లు స‌గం కూడా నిండ‌ని ప‌రిస్థితి. దీంతో ప్రొడ్యూస‌ర్స్ చాలా వ‌ర‌కు భారీ న‌ష్టాల‌ని చూడాల్సిన ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి.

దీంతో చాలా మంది చిన్న చిత్రాల‌ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌కుండా డైరెక్ట్ ఓటీటీకే ఇచ్చేస్తున్నారు. కొంత మంది మాత్రం థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేస్తూ న‌ష్టాల‌ని చ‌విచూస్తున్నారు. ఈ జూన్ 24న 10 నుంచి 11 చిత్రాల వ‌ర‌కు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ శుక్ర‌వారం టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి విష‌మ ప‌రీక్షే అని తెలుస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన 'విరాట‌ప‌ర్వం' మూవీకి గుడ్ టాక్ వున్నా క‌లెక్ష‌న్స్ మాత్రం ఆ స్థాయిలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మంచి సినిమాకే ఇలా వుంటే శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి రాబోతున్న సినిమాల ప‌రిస్థితి ఇంకెలా వుంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ మూవీస్ ల‌లో ఒక్క సినిమా 2.3 క్రోర్స్ నుంచి 3 కోట్ల వ‌ర‌కు బ‌డ్జెట్ తో రూపొందాయి. అయితే ఈ నెల 23 నుంచి 24 వ‌ర‌కు ప‌ది నుంచి 11 చిత్రాలు విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీకి ఈ మూవీస్ ద్వారా దాదాపు రూ. 30 కోట్ల మేర న‌ష్టం వాటిల్లే అవ‌కాశం క‌నిపిస్తోంది. జూన్ 23న త్రిగుణ్ హీరో గా రామ్ గోపాల్ వ‌ర్మ రూపొందించిన 'కొండా 'మూవీ రిలీజ్ అవుతోంది. కొండా ముర‌ళి, సురేఖ‌ల బ‌యోపిక్ గా రూపొందిన ఈ మూవీపై పెద్ద‌గా బ‌జ్ లేదని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.  

పైగా వ‌ర్మ సినిమా అంటే జ‌నాలు ఎవ‌రూ ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని, సో ఈ మూవీ భారీగా న‌ష్టాల‌ని చూడ‌టం ఖాయం అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇక జూన్ 24న దాదాపుగా ప‌ది చిన్నా చిత‌కా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో కిర‌ణ్ అబ్బ‌వ‌రం - చాందిని చౌద‌రి న‌టించిన 'స‌మ్మ‌త‌మే'పై మాత్ర‌మే కొంత బ‌జ్ వుంది. ఇక మిగ‌తా సినిమాలు ఆకాష్ పూరి న‌టించిన 'చోర్ బ‌జార్‌', ఎం.ఎస్‌. రాజు డైరెక్ట్ చేసిన '7 డేస్ 6 నైట్స్‌', సాయి రాం శంక‌ర్ 'ప‌థ‌కం ప్ర‌కారం'. గ్యాంగ్ స్ట‌ర్ గంగ‌రాజు, టెన్త్ క్లాస్ డైరీస్‌, షికారు, స‌దా న‌న్ను న‌డిపే.. త‌దిత‌ర సినిమాలకు పెద్ద‌గా బ‌జ్ లేదు.

దీంతో ఈ మూవీస్ బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భావాన్ని చూపించ‌డం క‌ష్ట‌మ‌ని, భారీ స్థాయిలో న‌ష్టాల‌ని చూడ‌టం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ప‌ద కొండు సినిమాలు బాక్సాఫీస్ పై దండ‌యాత్ర‌కు దిగుతున్న ఈ ఫ్రైడే నిజంగా టీఎఫ్ పై కి విష‌మ ప‌రీక్షే అంటున్నారు.
Tags:    

Similar News