ముత్యాల హారం కానుకిచ్చినదెవ‌రు సోనాల్?

Update: 2022-02-17 03:41 GMT
సోనాల్ చౌహాన్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌వ‌త‌రం హీరోల స‌ర‌స‌న కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత టాలీవుడ్ వెట‌ర‌న్ హీరో బాల‌కృష్ణ స‌ర‌స‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. ఆరంభం హ్యాపీడేస్ రాహుల్ స‌ర‌స‌న రెయిన్ బో అనే చిత్రంలో న‌టించింది  సోనాల్ చౌహాన్. ఆ త‌ర్వాత చాలా గ్యాప్ వ‌చ్చాక బాల‌య్య స‌ర‌స‌న లెజెండ్ చిత్రంలో న‌టించింది. ఆ సినిమాలో త‌న‌వైన అంద‌చందాల‌తో సోనాల్ కుర్ర‌కారును క‌ట్టి ప‌డేసింది. అటుపైనా బ్యాక్ టు బ్యాక్ బాల‌య్య స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంది. కానీ ఆ త‌ర్వాత కెరీర్ ఆశించినంత జోరందుకోలేదు. కానీ సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానుల‌కు వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ భారీగా ఫాలోయింగ్ పెంచుకుంది.

కొంత గ్యాప్ త‌ర్వాత ఇదిగో ఇలా ముత్యాల హారం థై స్లిట్ ఫ్రాకులో ప్ర‌త్య‌క్ష‌మైంది. బ్లాక్ ఫ్రాక్ లో పర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో మైమ‌రిపిస్తోంది ఈ బ్యూటీ. ముఖ్యంగా ఆ మెడ‌లో ముత్యాల‌హారం హైలైట్ గా నిలిచింది.

మంత్ర‌గ‌త్తె ముత్యాల హారం క‌థేమి? .. ముత్యాల హారం కానుకిచ్చినదెవ‌రు సోనాల్? అంటూ అభిమానులు ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. వాటికి స‌మాధానం త‌నే చెప్పాలి.

నిరంత‌రం బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో అల‌రించే సోనాల్ కి ఇది స‌రికొత్త ప్ర‌య‌త్న‌మ‌ని చెప్పాలి. అలా ఏంజెలిన్ త‌ర‌హాలో త‌న వేష‌ధార‌ణ‌ను మార్చి ప్ర‌యోగం చేసింది. టైటానిక్ క్యాట్ విన్ స్లెట్ లా.. సాల్ట్ యాంజెలినా లా .. బాండ్ గాళ్ హాలీ బెర్రీలా ప్ర‌యోగాలు చేయాల‌ని ఉన్నా త‌న‌కు ఆ స్థాయి స్క్రిప్టులేవీ రావ‌డం లేదు. క‌నీసం ఇక‌నైనా త‌న కెరీర్ లో బెట‌ర్ మెంట్ ఉంటుందేమో చూడాలి. సోనాల్ చివరిసారిగా ది పవర్ అనే చిత్రంలో న‌టించింది. విద్యుత్ జామ్వాల్- శ్రుతి హాసన్ ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. త‌దుప‌రి ప‌లు వెబ్ సిరీస్ ల‌కు సంత‌కాలు చేయ‌నుంద‌ని తెలుస్తోంది. సౌత్ లోనూ అవ‌కాశాల కోసం తీవ్రంగానే ప్ర‌య‌త్నిస్తోంది.

క్రేజీగా ఎఫ్ 3లో జాక్ పాట్

సోనాల్ కొంత గ్యాప్ త‌ర్వాత ఎఫ్ 3లో ఆఫ‌ర్ అందుకుంది. ఇది నిజంగానే త‌న‌కు జాక్ పాట్ అని చెప్పాలి. యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి `ఎఫ్ -2` కి సీక్వెల్ గా ఎఫ్ -3ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `ఎఫ్ -2` లో న‌టించిన న‌టీన‌టుల‌తోనే ఈ సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారు. వెంక‌టేష్ కు జోడీగా త‌మ‌న్నా..వ‌రుణ్ తేజ్ కి జోడీగా మెహ‌రీన్  న‌టిస్తున్నారు. ఇక మూడ‌వ హీరోయిన్ సోనాల్ చౌహాన్ తీసుకున్నారు. ఇందులో సోనాల్ పాత్ర కూడా ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌ని యూనిట్ తెలిపింది. సోనాల్ ఎంట్రీతో సినిమాకు మరింత మ‌సాలా ద‌ట్టించిన‌ట్లు అయింద‌ని చిత్ర వ‌ర్గాలు భావిస్తున్నాయి. ప్ర‌స్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఇటీవ‌ల‌ సినిమాలో త‌న పాత్ర గురించి సోనాల్ చౌహాన్ రివీల్ చేసింది.

`ఎఫ్ -2` సినిమా చూసాను. కానీ ఈ సినిమా సీక్వెల్ లో న‌టిస్తాన‌ని ఎప్పుడు అనుకోలేదు. ఇందులో నా పాత్ర‌కు చాలా స్కోప్ ఉంది. చాలా కాలం త‌ర్వాత మంచి రోల్ చేస్తున్నాన‌ని ఎగ్టైట్ మెంట్ క‌ల్గుతోంది.  పాత్ర‌ను ఓన్ చేసుకుని ద‌ర్శ‌కుడితో క‌లిసి ప్ర‌యాణిస్తున్నాను.  తెలుగులో నాకొక మంచి చిత్రంగా ఎఫ్ -3 నిలిచిపోతుంది` అని తెలిపింది. అలాగే కొత్త అవ‌కాశాలు కూడా వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డించింది.  ఇప్ప‌టికే సోనాల్ పై షూటింగ్ చేసిన‌ సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News