'చిలసౌ' సినిమాతో తెరంగేట్రం చేసిన సిమ్లా బ్యూటీ రుహాని శర్మ సుపరచితురాలే. తొలి సినిమాతోనే సక్సెస్ ఖాతాల వేసుకుంది. త్రివిక్రమ్ లాంటి దిగ్గజ దర్శకుల ప్రశంసలు రిలీజ్ కి ముందే అందుకుంది. రిలీజ్ తర్వాత అందరి నోట పాజిటవ్ వైబ్ తో సక్సెస్ గాళ్ల గా నిరూపించుకుంది. అదే ఊపులో 'హిట్'..'డర్టీ హరి' చిత్రాల్లో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంది. 'హిట్' మంచి విజయం సాధించింది. కానీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బోల్డ్ అటెంప్ట్ 'డర్టీ హరి' మాత్రం వాటిని అందుకోవడంలో విఫలమైంది.
ఈసినిమాతో రుహాని తనలో సెకెండ్ యాంగిల్ ని పరిచయం చేసింది. బోల్డ్ పెర్పార్మెన్స్ తో విమర్శలకుల ప్రశంసలు అందుకుంది. కానీ సినిమా వైఫల్యం తో ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది.
ఆ తర్వాత 'నూటొక్క జిల్లాల అందగాడు' లో ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమా ఫలితం అమ్మడిని వెనక్కి లాగిపెట్టింది. ప్రస్తుతం 'మీట్ క్యూట్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రకటనొచ్చి చాలా కాలమవుతోంది. కానీ మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. సినిమా రన్నింగ్ లో ఉందా? రద్దాయిందా? అన్న సందేహాలు సైతం తెరపైకి వస్తున్నాయి.
ఆ సంగతి పక్కనబెడితే రుహాని శర్మ సెకెండ్ ఇన్నింగ్స్ ని పెళ్లికి ముందే ప్రారంభించడానికి రెడీ అనేసింది. హీరోయిన్ గానే కాదు...నెగిటివ్ రోల్స్ వచ్చినా చేయడానికి సిద్దంగా ఉన్నాను అన్న సంకేతాలు పంపేసింది. పాత్ర నచ్చితే ఎలా నటించడానికైనా సిద్ధం అనేసిందట. అలాంటి అవకాశాలో కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అమ్మడు పూర్తిగా ఖాళీ అయిపోవడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో చేతిలో ఉన్న ఒక్క సినిమా సంగతేంటో? క్లారిటీ లేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చిక్కబెట్టాలి అన్న కోణంలో ఉన్న క్రేజ్ తోనైనా అవకాశాలు అందుకోవాలన్న ఆశతో వెయిట్ చేస్తోంది. మరీ ఈ భామని ప్రోత్సహించే దర్శక-నిర్మాతలు ఎంత మంది ఉంటారో.
ఇక బాలీవుడ్ లో 'ఆగ్ర' సినిమాతో లాంచ్ అవుతోంది. ఈ సినిమా హిట్ అయితే అక్కడ బిజీ అవుతుంది. అయినా అమ్మడు భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని అక్కడ బిజీ అయ్యే ప్రయత్నాలు ఎక్కువగా చేసే అవకాశం కనిపిస్తుంది.