100 కోట్ల రీమేక్ కోసం మెగా డాటర్!!

Update: 2018-09-22 07:34 GMT
ఇటీవలే బాలీవుడ్ లో చిన్న సినిమాగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన హారర్ కామెడీ మూవీ స్త్రీ అనూహ్యంగా వంద కోట్ల వసూళ్లు దాటించేసి అక్కడి ట్రేడ్ కు పెద్ద షాక్ ఇచ్చింది. స్టార్లు లేకుండా సాహో ఫేమ్ శ్రద్ధ కపూర్ టైటిల్ రోల్ లో అంత ఇమేజ్ లేని రాజ్ కుమార్ రావు హీరోగా రూపొందిన ఈ మూవీ సీజన్ లోనే సర్ప్రైజ్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు దీని రీమేక్ పై ఇతర బాషా దర్శక నిర్మాతల కళ్ళు పడ్డాయి. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాతలు రాజ్ నిడిమోరు-కృష్ణ తెలుగువాళ్లే. కేవలం 15 కోట్ల లిమిటెడ్ బడ్జెట్ లోనే దీన్ని పూర్తి చేసి ఇప్పుడు సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని సౌత్ లో  తామే రీమేక్ చేసుకునే ఆలోచనలో కొందరు హీరోయిన్లను కలవడం జరిగిందట.

విశ్వసనీయ సమాచారం మేరకు మెగా డాటర్ నీహారిక సమంతా ఇద్దరికీ ఇది వినిపించారట. ఇటీవలే సమంతా కన్నడ హారర్ కం థ్రిల్లర్  యుటర్న్ రీమేక్ లో నటించిన సంగతి తెలిసిందే.రెస్పాన్స్ బాగా వచ్చినప్పటికీ అది వసూళ్ల రూపంలో పూర్తి ఫలితం రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో మరో హారర్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పడినట్టు సమాచారం. మరోవైపు నీహారిక దీని పట్ల పాజిటివ్ గా ఉందని తెలిసింది. తెలుగు తమిళ్ లో చేసిన సినిమాలేవీ వర్క్ అవుట్ కాకపోవడంతో రీమేక్ అయితే సేఫ్ అనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఎవరు చేసినా ప్రూవ్ అయిన కంటెంట్ కాబట్టి సరైన టీమ్ దొరికితే మంచి ఫలితాన్నే దక్కించుకోవచ్చు. సాహో విడుదలైపోయి శ్రద్ధకు ఇక్కడే గుర్తింపు వచ్చి ఉంటే తనే చేసేదేమో కానీ ఇప్పటికైతే బాల్ సమంతా నీహారికల మధ్య ఉంది. ఎవరు అందుకుంటారో ప్రస్తుతానికి సస్పెన్స్.
Tags:    

Similar News