మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల నటించిన సూర్యకాంతం ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజిబిజీగా ఉంది. తాజాగా నేడు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో నీహారిక పలు ఆసక్తికర సంగతుల్ని ముచ్చటించారు. సూర్యకాంతం అన్న టైటిల్ తనకు యాప్ట్ అని నిహారిక తెలిపారు. నాన్న కూచి వెబ్ సిరీస్ లో నటించేప్పుడే ప్రణీత్.బి మైండ్ లో ఆ టైటిల్ రిజిస్టర్ అయ్యిందని అనుకుంటున్నాను. ఆ టైమ్ లో దర్శకుడు ప్రణీత్.బి నాపై ఓ డైలాగ్ రాసారు. కానీ అది నాన్నగారికి నచ్చలేదు. `మా అమ్మాయి సూర్యకాంతం లాంటిది` అంటూ డాడ్ డైలాగ్ నే మార్చేశారు.. అంటూ నిహారిక తనదైన శైలిలో స్మైల్ ఇచ్చారు. బర్ఫీ మూవీలో ప్రియాంక చోప్రా పాత్రలా స్వచ్ఛంగా ఉండే అమ్మాయి సూర్యకాంతం అని తెలిపారు.
ఇక వెబ్ సిరీస్ లపై తన ఆసక్తి గురించి చెబుతూ.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి డిజిటల్ దిగ్గజాల రాకతో వెబ్ సిరీస్ ల వెల్లువ పెరిగింది. అక్కడ కుటుంబ సమేతంగా కూచుని చూసే వెబ్ సిరీస్ లు చేయాలనుందని అన్నారు. తదుపరి సొంత బ్యానర్ `పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్` బ్యానర్ లో సొంతంగా వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నానని నిహారిక తెలిపారు. ప్రొడక్షన్ అంటే తొలి నుంచి ఇష్టం. నాన్న, అరవింద్ మామను దగ్గరగా చూసాను కాబట్టి ఆ రంగంపై మక్కువ ఏర్పడింది. ముద్ద పప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ ని నిర్మించడానికి కారణమదేనని తెలిపారు. తదుపరి చేయబోయే వెబ్ సిరీస్ ని 100 ఎపిసోడ్స్ తో ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. కష్టపడి డబ్బు సంపాదించాలి. నిలదొక్కుకోవాలని తన క్యాలిక్యులేషన్ ని క్లియర్ కట్ గా నిహారిక రివీల్ చేశారు. ఇక సినిమాలు నిర్మించాలన్న మోటో లేదు. ఇప్పటికి వెబ్ సిరీస్ నిర్మాణంపైనే దృష్టి సారించానని తెలిపారు.
సినిమాల్లో నటించాలన్నది వంద శాతం మనసు పెట్టి చేస్తున్నా. తిట్టినా కొట్టినా ఆ పని కూడా మనసు పెట్టి చేస్తానని నిహారిక అన్నారు. తాను ఏం చేసినా దానిపై పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తానని, ఆసక్తి లేకపోతే ఈ రంగంలోకే వచ్చేదానిని కాదని నిహారిక తెలిపారు. సూర్యకాంతం సినిమాకి ముందు పక్కింటి అమ్మాయి.. పద్ధతైన అమ్మాయి టైపులో 8-10 స్క్రిప్టులు వచ్చాయి. కానీ వాటన్నిటిలో నెగెటివ్ షేడ్ ఉన్న సూర్యకాంతం కథే నన్ను ఆకర్షించింది. అందుకే నటించానని నిహారిక తెలిపారు. తెలుగు, తమిళంలో నటించే ఆసక్తి ఉంది. ప్రస్తుతం ఓ రెండు స్క్రిప్టులపై వర్క్ జరుగుతోంది. తదుపరి వివరాలు వెల్లడిస్తానని అన్నారు.