మెగా డాటర్ భలే వేషం

Update: 2018-01-17 07:12 GMT
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరొయిన్ గా గుర్తింపు ఉన్న నీహారిక మొదటి సినిమా ఒక మనసు కంటెంట్ పరంగా ప్రశంశలు అందుకున్నప్పటికి కమర్షియల్ గా దారుణంగా ఫెయిల్ కావడంతో తెలుగులో మళ్ళి కొత్త ప్రయత్నాలు అయితే ఏవి చేయలేదు. మరోపక్క వెబ్ సిరీస్ లో బిజీ గానే ఉంది. సరే ఇక్కడ మెగా ఫాన్స్ ఆంక్షలు అంచనాలు ఉండనే ఉన్నాయి కదా అని తమిళ్ లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే పనిలో ఉంది నీహారిక. తను నటించిన కోలీవుడ్ డెబ్యు మూవీ ఒరు నల్ల నాల్ పాత్రు సోల్రెన్. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఆ మూవీలో నీహారిక చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్భంగా అందులో తామిద్దరూ ఉన్న ఒక స్టిల్ ని పోస్ట్ చేసింది నిహారిక.

కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో ఇద్దరి గెటప్స్ చాలా వెరైటీగా ఉండగా నీహారిక ఒంటి మీద మొత్తం నగలు దిగేసుకుని చేతిలో గన్ను పట్టుకుని లేడీ గబ్బర్ సింగ్ తరహా లుక్ ఇస్తోంది. మరోవైపు విజయ్ సేతుపతి బంగారు రంగులో మెరిసిపోతున్న గదను పట్టుకుని సీరియస్ గా చూస్తూ ఉండటం కిక్ ఇస్తోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా రిలీజ్ డేట్ ఇంకా డిసైడ్ కాలేదు. ఫాంటసీ ఛాయలు ఉండే ఈ కథలో తన పాత్ర చాలా కీలక మలుపులకు కారణం అవుతుందని చెబుతున్న నీహారిక ఇది తనకు మేజర్ బ్రేక్ అవుతుందని ఆశిస్తోంది.

దీన్ని డబ్బింగ్ చేస్తారా లేదా అనే దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. విజయ్ సేతుపతి తమిళ్ లో ఎన్నో విజయాలు సాధించినా అతనికి ఇక్కడ మార్కెట్ లేదు కనక ఇప్పటి దాకా ఒక్క సినిమా కూడా డబ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ విక్రం వేదా సైతం అదే కారణంతో చేయలేకపోయారు. మరి ఇది మెగా డాటర్ అనే బ్రాండ్ ఉంది కాబట్టి చేసే అవకాశాలు లేకపోలేదు.
Tags:    

Similar News