మొన్న తన సినిమా ముద్ర విడుదల తేది ఇంకా నిర్ణయించకముందే బుక్ మై షోలో టికెట్లు పెట్టడం చూసి అభిమానుల ద్వారా తెలుసుకున్న నిఖిల్ వెంటనే చర్యలు తీసుకుని సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇదే పేరుతో మరో సినిమా కూడా ఉండటంతో ఈ చిక్కు వచ్చింది. అయితే కేవలం పబ్లిసిటీ కోసం ఇలా నిఖిల్ టీం పేర్లను అందులో పొందుపరిచి ప్రేక్షకులను ఏమార్చే ప్రయత్నం చేయడం పట్ల సోషల్ మీడియాలో సైతం తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే సమస్య అక్కడితో ఆగలేదు.
ఏషియన్ మల్టీ ప్లెక్స్ కు చెందిన ఓ థియేటర్ వద్ద నిఖిల్ స్టిల్ ఉన్న ముద్ర పోస్టర్ పెట్టి సాయంత్రం నాలుగున్నరకు షో అని పోస్టర్ పెట్టడం అయోమయం మరోసారి మొదలైంది. ఇది నిజమనుకుని నమ్మి టికెట్లు కొన్నవాళ్ళు కూడా ఉన్నారు. బుక్ మై షో యాప్ లో నిఖిల్ పేరు తీసేసారు కాని ఇలా థియేటర్ల దగ్గర మార్పు చేయకపోవడం మరోసారి గందరగోళానికి దారి తీసింది. ఇది నిఖిల్ దృష్టికి వెళ్ళింది. ఇలా ఫేక్ పోస్టర్లతో తన సినిమాలాగా ఇంకో దాన్ని ప్రమోట్ చేయడం గురించి ఫైర్ అవుతున్నాడు.
నిజానికి నిఖిల్ ఆవేదనలో అర్థముంది. గత ఏడెనిమిది నెలలుగా ముద్ర కోసమే నిఖిల్ తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఇందు కోసం శరీరాన్ని కష్టపెట్టి మరీ దర్శకుడు కోరిన రీతిలో మలచుకున్నాడు. విపరీతమైన పోటీ ఉన్న నేపధ్యంలో సరైన డేట్ కోసం ఎదురు చూస్తూ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ ని పూర్తి చేసేస్తున్నారు. ఇప్పుడిలా నకిలీ ముద్ర గొడవ రకరకాల రూపాల్లో నిఖిల్ టీం కు తలనెప్పిగా మారింది.ఇలా ఒకే టైటిల్ తో క్లాష్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాల్సిన నిర్మాతల సమాఖ్య నిర్లిప్తంగా ఉండటం గమనార్హం.