హీరోలు.. నిర్మాతలు.. దర్శకులు.. తమ సినిమా పూర్తవగానే ఒకసారి ప్రివ్యూ వేసుకుని చూడటం మామూలే. ఆ ఎగ్జైట్మెంట్ వాళ్లలో తప్పకుండా ఉంటుంది. ఐతే హీరో నిఖిల్ మాత్రం ఇలా చేయట్లేదట. అతడికి ఈ మధ్య ఓ చిత్రమైన సెంటిమెంటు పట్టుకుంది. తన సినిమా ఫస్ట్ కాపీని చూసుకోకుండానే రిలీజ్ చేసేయడం అతడికి సెంటిమెంటుగా మారిందట. ‘స్వామి రారా’ చిత్రాన్ని అనుకోకుండా ఇలా ప్రివ్యూ చూసుకోకుండా రిలీజ్ చేశామని.. అది సూపర్ హిట్ అయిందని.. అప్పట్నుంచి అదే సెంటిమెంటును కంటిన్యూ చేస్తున్నానని.. వరుసగా మూడు హిట్లు కొట్టడంతో ఆ సెంటిమెంటు బలపడిందని నిఖిల్ చెప్పాడు. తన కొత్త సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాను చూసుకోవాలన్న క్యూరియాసిటీ కలిగినా.. సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని ఆపుకున్నానని నిఖిల్ తెలిపాడు.
ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఎక్కడిపోతావు చిన్నవాడా’ విశేషాల గురించి నిఖిల్ చెబుతూ.. ‘‘ఇంత మంచి కథ నన్ను వెదుక్కొంటూ రావడం నా అదృష్టం. ఆనంద్ అనుకొంటే ఏ పెద్ద హీరోకైనా ఈ కథ చెప్పి సినిమా చేయొచ్చు. కానీ నాతోనే సినిమా చేశాడు. ఈ మధ్య నేను ప్రేమకథలు చేయలేదు. ఇందులో లవ్ స్టోరీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఐతే ఈ సినిమాలో ప్రేమే కాదు.. ఫాంటసీ - వినోదం - థ్రిల్ - హారర్ కూడా ఉన్నాయి. దెయ్యాల్ని.. ఆత్మలను చూపిస్తున్నాం కానీ.. ఇది వరకు చూసిన సినిమాల్లోలాగా ఉండవు. ఇది సీరియస్ గా చెప్పాల్సిన కథే అయినా.. జనాలు అలా అయితే చూడరని వినోదాత్మకంగా చెప్పాం. ప్రతి సన్నివేశం నవ్విస్తూనే ఉంటుంది. వెన్నెల కిషోర్ కామెడీకి సెట్లో మేం పగలబడి నవ్వాం. థియేటర్లోనూ అలాంటి రెస్పాన్సే వస్తుంది. మా తొమ్మిది నెలల కష్టం ఈ సినిమా. కచ్చితంగా అందుకు ఫలితం దక్కుతుంది’’ అని నిఖిల్ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/