యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ - అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ''18 పేజెస్''. 'కార్తికేయ-2' వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ నాస్టాల్జిక్ రొమాంటిక్ ఎంటర్టైనింగ్ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.
'18 పేజెస్' చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ - స్క్రీన్ ప్లే అందించగా.. అతని శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా తుది దశకు చేరుకుంది. కొంత విరామం తర్వాత, నిఖిల్ అండ్ టీమ్ తిరిగి సెట్ లో అడుగుపెట్టారు.
'18 పేజీస్' చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. చిత్రీకరణ కూడా అద్భుతంగా కొనసాగుతుందని చెబుతూ షూటింగ్ స్పాట్ లోని ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 23న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
నిజానికి 'కార్తికేయ-2' కంటే ముందే రెండేళ్ల క్రితమే మొదలైన ఈ చిత్రం.. దాని కంటే ముందే విడుదల కావాల్సింది. ఈ ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ చేస్తారని అనుకున్నారు. ఆ తర్వాత సమ్మర్ లో విడుదల అని అనౌన్స్ చేశారు. దీనికి తగ్గట్టుగానే శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వదిలిన ఫస్ట్ లుక్ & స్పెషల్ పోస్టర్స్ మరియు గ్లిమ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఏమైందో ఏమో జూన్ లో రిలీజ్ అని ప్రకటించిన ఈ సినిమాకు బ్రేక్ పడింది. దీంతో హీరో నిఖిల్ ముందుగా 'కార్తికేయ 2' చిత్రాన్ని పూర్తి చేసి థియేటర్లలోకి వదిలాడు.
పాన్ ఇండియా స్థాయిలో 'కార్తికేయ 2' సినిమా సంచలనం సృష్టించింది. 130 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ముఖ్యంగా నార్త్ లో అనూహ్య విజయం సాధించింది. దీంతో ఇప్పుడు నిఖిల్ తదుపరి సినిమాలపై అంచనాలు ఏర్పడ్డాయి.
కాకపోతే అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న '18 పేజెస్' చిత్రానికి మళ్లీ షూటింగ్ ఏంటనేదే ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే 'కార్తికేయ 2' ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా 'కార్తికేయ 2' సక్సెస్ ఇప్పుడు '18 పేజెస్' సినిమా చుట్టూ బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. మంచి మార్కెట్ చేసుకోడానికి నిర్మాతలకు అవకాశం కల్పించింది. అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'18 పేజీస్' సినిమాకు గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. శ్రీకాంత్ విస్సా సంభాషణలు రాయగా.. ఎ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రమణ వంక ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.