ఒక విజయవంతమైన సినిమాకి సీక్వెల్ తీయడం అంటే ఆషామాషీనా? కథ పెర్ఫెక్ట్ గా కుదరాలి. దాని కోసం చాలానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. అందుకేనేమో.. నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ `కార్తికేయ` సీక్వెల్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నా.. అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. తాజాగా కార్తికేయ సీక్వెల్ ని అధికారికంగా ప్రకటించింది టీమ్. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై `కార్తికేయ - 2` త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ మేరకు దర్శకనిర్మాతలు వివరాల్ని వెల్లడించారు.
జూన్ 1న నిఖిల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఒక రోజు అడ్వాన్స్ డ్ గానే దర్శకనిర్మాతలు అతడికి కానుకను ప్రకటించారు. 2014 బ్లాక్ బస్టర్ కార్తికేయ సీక్వెల్ తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చందు మొండేటి మాట్లాడుతూ ``నిఖిల్ హీరోగా దర్శకునిగా నా తొలి చిత్రం `కార్తికేయ` ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో `కార్తికేయ - 2` పైనా భారీ అంచనాలుంటాయనే భావిస్తున్నాం. అందుకు తగినట్టుగానే ఈ చిత్రం ఉంటుంది. కార్తికేయ కు కొనసాగింపుగా కథాంశం ఉంటుంది. కథ కథనాలు సరికొత్తగా ఉంటాయి. ఓ రకంగా ఇది పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. సీక్వెల్ నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభిస్తాం. ఇతర నటీ,నట సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం`` అని తెలిపారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకరచయితగా కొనసాగుతున్నారు.
అయితే చందు మొండేటి క్యూలో ఇప్పటికే రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఓవైపు శర్వానంద్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నాడు. ఈలోగానే నిఖిల్ హీరోగా చందు దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్ ని మేకర్స్ ప్రకటించారు. అయితే ముందుగా ఈ రెండిటిలో ఏ సినిమా ప్రారంభం కానుంది అన్నది ఇప్పటికి సస్పెన్స్.