మెగా స్టార్ 151వ సినిమా సైరా.. నరసింహారెడ్డిని భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో లార్జర్ దేన్ లైఫ్ తరహాలో తీయడానికి ఆ మూవీ ప్రొడ్యూసర్ - చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ రెడీ అయిపోయాడు. ఈ సినిమా క్యాస్టింగ్ అండ్ టెక్నీషియన్స్ అంతా టాప్ రేంజ్ లో ఉన్నవాళ్లనే ఎంపిక చేసుకున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తారని తొలుత ప్రకటించారు. కానీ ఈ సినిమాకు తాను పనిచేయబోవడం లేదని ఈ మధ్య రెహమాన్ ప్రకటించాడు.
రెహమాన్ మ్యూజిక్ తో స్ట్రయిట్ గా తెలుగు పాట వినే అవకాశం కోల్పోయామని కొందరు సినీ అభిమానులు బాధపడ్డా.. మెగా అభిమానులు మాత్రం ఈ విషయంలో హ్యాపీగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రెహమాన్ మ్యూజిక్ అంటేనే ఓ సంచనలం అన్నట్టుండేది. ఒక్కో పాట శ్రోతలను ఊపేసేది. కానీ ఈమధ్య అతడి మ్యూజిక్ లో ఆ మ్యాజిక్ మిస్సయింది. టోటల్ ఆల్బమ్ లో ఒకటి రెండు పాటలు కూడా జనాలకు ఎక్కడం లేదు. లేటెస్ట్ గా వచ్చిన చెలియాలో అయితే ఒక్క పాట కూడా జనాలకు కనెక్ట్ కాలేదు. తాజాగా రెహమాన్ రజనీకాంత్ - శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న 2.0 సినిమాకు సంగీతం అందించాడు. ఈ పాటలు విన్నవారు కూడా పెదవి విరిచేస్తున్నారు.
సైరా సినిమా చేయడానికి తన దగ్గర టైం లేనందువల్లే చేయలేకపోతున్నానని రెహమాన్ మాట దాటవేశాడు. కానీ ప్రస్తుతం మళయాళంలో పృథ్వీరాజ్ హీరోగా నటిస్తున్న మీడియం బడ్జెట్ మూవీ ఆడు జీవితంకు సంగీతం అందిస్తున్నాడు. కాబట్టి సైరా నుంచి తప్పుకోవడానికి ఇతర కారణాలేవో ఉండి ఉంటాయని అందరూ అనుకుంటున్నదే. ఏ కారణంతో రెహమాన్ తప్పుకున్నా మెగా అభిమానులు మాత్రం ఈ పరిణామం పట్ల హ్యాపీగానే కనిపిస్తున్నారు.