టాలీవుడ్ లో రకుల్ పాప గల్లంతు?

Update: 2019-11-06 07:03 GMT
ఈమధ్యకాలంలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటోంది.  సీనియర్ హీరోయిన్లు కొందరు 15 ఇయర్స్ కూడా తమ కెరీర్ కొనసాగించగలిగారు కానీ ఈ కాలం హీరోయిన్లకు మాత్రం అది చాలా కష్టంగా మారింది.  రకుల్ ప్రీత్ సింగ్ విషయమే తీసుకుంటే ఓ రెండేళ్ళ క్రితం సూపర్ ఫామ్ లో ఉండేది కానీ ఇప్పుడు తెలుగులో అవకాశాలే లేవు. దీంతో తన ఫోకస్ పూర్తిగా హిందీపై పెట్టాల్సి వస్తోంది.

నిజానికి రకుల్ 'స్పైడర్'(2107) తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.  ఆ సినిమా తర్వాత 'ఎన్టీఆర్ కథానాయకుడు' లో ఒక క్యామియోలో నటించింది.  ఈ ఏడాది అక్కినేని నాగార్జున సినిమా  'మన్మథుడు-2' లో హీరోయిన్ గా నటించింది.  అయితే ఆ సినిమా హిట్ కాకపోవడం సంగతి పక్కన పెడితే రకుల్ ఇమేజ్ ని దెబ్బతీసింది.  దీంతో అప్పటి నుంచి రకుల్ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ టాలీవుడ్ ఆఫర్ రాలేదని సమాచారం. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లోనూ హిందీలో ఒక సినిమాలోనూ నటిస్తోంది.  తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో హిందీపైనే ఎక్కువగా దృష్టి సారించాలని అనుకుంటోందట.

అయితే ఇలా బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసి అక్కడికి పోతే ఒక్క చిక్కుంది.. టాలీవుడ్ మేకర్స్ అవకాశాలు ఇవ్వడం మానేస్తారు.  గతంలో ఇలియానా విషయంలో ఇలానే జరిగింది.  ఓవరాల్ గా చూస్తే రకుల్ కెరీర్ టాలీవుడ్ లో ముగిసినట్టేననిపిస్తోంది.  ఎందుకంటే పెద్ద స్టార్ హీరోలు ఎవ్వరూ తమ సినిమాలకు రకుల్ పేరును పరిశీలించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో కూడా ఏవైనా క్రేజీ అవకాశాలు సాధించి అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News