యంగ్ హీరో నిఖిల్ గతంలో ప్రత్యేక హోదా విషయంతో ఆంధ్ర ప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం గురించి చేసిన ట్వీట్ గురించి మరోసారి స్పష్టత ఇచ్చాడు. "మూడు నెలల క్రితం కిరాక్ పార్టీ షూటింగ్ లో ఉన్నప్పుడు ఉత్సుకతను తట్టుకోలేక అమరావతిని సందర్శించాను. అప్పుడప్పుడే పునాదులు వేసుకుంటున్న నిర్మాణాలు చూసి అసలు ఇది 25 లేదా 30 ఏళ్ళలో పూర్తవుతుందా అనిపించింది. లేదూ కనీసం నా జీవితం అయిపోయేలోపైనా చూస్తానా అన్న అనుమానం కలిగింది. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులు ఇది తమ రాజధాని కాదని తెలిసి తల్లడిల్లుతున్నారు. కేంద్ర ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇచ్చే ఆలోచనలో ఉందని తెలిసి ఒక బాధ్యత కలిగిన యువకుడిగా ఆ ట్వీట్ పెట్టాను. నేను పెట్టిన మెసేజ్ ఏదో గొప్ప మార్పు తీసుకొస్తుందని కాదు మనిషిగా అది కనీస బాధ్యతగా భావించాను" ఇది తాజాగా నిఖిల్ వెర్షన్.
గతంలో ప్రత్యేక హోదా గురించి ట్వీట్ చేసిన కొద్దిరోజులకు నిఖిల్ కు కొందరు ఇండస్ట్రీ పెద్దలు వార్నింగ్ లాంటిది ఇచ్చారని, ఇలాంటి ఇష్యూస్ జోలికి వెళ్ళకని హెచ్చరించారని పలు వార్తలు వచ్చాయి. దీని నిఖిల్ పూర్తిగా ఖండించాడు. ఇవన్ని నిరాధారమని సినిమా వ్యక్తి ఎవరు ఆ ట్వీట్ విషయంలో కనీసం తనకు ఫోన్ కూడా చేయలేదని క్లారిటీ ఇచ్చేసాడు.
నిజానికి నిఖిల్ ఈ ప్రత్యేక హోదా నినాదాన్ని తన సినిమా కిరాక్ పార్టీ ప్రమోషన్ కోసమే వాడుకున్నాడు అనే కామెంట్స్ అప్పట్లోనే వినిపించాయి. దానికి కూడా నిఖిల్ బదులు ఇచ్చాడు. ఇప్పుడు సక్సెస్ టూర్ లో ఉన్నాను కనక మీడియా వాళ్ళు ఆడుగుతున్న ప్రశ్నలకు బాధ్యతగా బదులు ఇస్తున్నాను తప్ప ఇదేదో సినిమా ప్రమోషన్ వాడుకునే పరిస్థితిలో తాను లేనని నిఖిల్ స్పష్టం చేసాడు.