8న డీమానిటైజేషన్.. 9న డీక్రిమినైలైజేషన్

Update: 2016-12-08 17:30 GMT
ఒక్కోసారి అంతే.. కొత్త కొత్త పదాలు పరిచయం అవుతుంటాయ్. ఫస్ట్ టైం సునామీ వచ్చే వరకూ.. ఆ పదంతో అంతగా పరిచయం లేదు. రీసెంట్ గా డీమానిటైజేషన్ అంటూ దేశం అంతా అట్టుడికిపోతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాతే ఈ వర్డింగ్ కి డిమాండ్ పుట్టింది. నవంబర్ 8 సాయంత్రం మోడీ చెప్పిన తర్వాత.. నవంబర్ 9నుంచి డీమానిటైజేషన్ మొదలైంది.

ఇప్పుటు చెర్రీ కొత్త కాన్సెప్ట్ పట్టుకొస్తున్నాడు. 'డిక్రిమినలైజేషన్' అంటూ ధృవకు ట్యాగ్ లైన్ పెట్టారు. ప్రచారం కోసం 'డిసెంబర్ 9 నుంచి డిస్క్రిమినలైజేషన్' అంటున్నారు. పదాలు ప్యారలల్ గా ఉన్నా.. రెండింటికీ అంతరం చాలా ఉంది లెండి. అసలు క్రిమినల్ అనే వాడు లేకుండా చేయడం అన్నది.. ఈ డిస్క్రిమినలైజేషన్ అర్ధం. అసలెలా గుర్తించాలో కూడా చెబుతూ.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓ 1మినిట్ వీడియో వైరల్ అయిపోతోంది.

ప్రతీ నేరం వెనక ఉన్న వ్యాపార కోణాన్ని స్పృశిస్తూ.. ఆ క్రైం వెనక దాగున్న వ్యాపార ప్రయోజనాలను.. వ్యవస్థాగతంగా నేర సామ్రాజ్యాన్ని నడిపించే ఆర్గనైజ్డ్ క్రైమ్ వ్యవహారాలను బయటకు లాగడమే ధృవ మూవీ. దానికే.. డిస్క్రిమినలైజేషన్ అంటూ పెద్ద పేరును పాపులర్ చేస్తోంది ధృవ టీం.
Tags:    

Similar News