ఎన్టీఆర్ 30 రిలీజ్ డేట్ మాత్రమే కాదు అది కూడా కన్ఫర్మ్..!

Update: 2023-01-02 05:32 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి న్యూ ఇయర్ అప్డేట్ తారక్ ఫ్యాన్స్ ని కొంత అసంతృప్తికి గురి చేసింది. ఆర్.ఆర్.ఆర్ రిలీజై చాలా నెలలు అవుతున్నా ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లలేదని ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉండగా లేటెస్ట్ గా ఎన్టీఆర్ 30వ సినిమాని 2024 ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేయడంపై ఫ్యాన్స్ షాక్ అయ్యారు. లేట్ అయినా కూడా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అద్భుతమైన కథతో ఈ సినిమా తీసేలా ప్లాన్ చేశాడట కొరటాల శివ.

అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. రిలీజ్ డేట్ మాత్రమే కాదు హీరోయిన్ గా జాన్వి కపూర్ కన్ఫర్మ్ అంటున్నారు. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాన్వి కపూర్ కూడా తెలుగు సినిమాల్లో నటించాలని చాలాకాలంగా ఆరాటపడుతుంది.

ఆమె ఆసక్తిని గమనించి మన మేకర్స్ కూడా తనని టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాలో నటించాలని ఉందని జాన్వి స్పెషల్ గా మెన్షన్ చేసింది.

అందుకే ఎన్టీఆర్ 30వ సినిమాలో తనకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. శ్రీదేవి తరహాలో సౌత్ సినిమాల్లో కూడా రాణించాలని చూస్తుంది జాన్వి కపూర్. అందుకే సరైన సినిమా కోసం ఇన్నాళ్లు ఎదురుచూసింది.

కొరటాల శివ, ఎన్టీఆర్ ఈ కాంబో సినిమాతో ఆమె టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో నటించేందుకు జాన్వి కపూర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ 30వ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, యువసుధ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమా విషయంలో కొరటాల శివ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీగా తెరకెక్కించే ప్లాన్ చేశాడట. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ నేషనల్ లెవల్ లో చేస్తున్న సినిమా కాబట్టి సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడట కొరటాల శివ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News