'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. ఇద్దరు హీరోలను సరికొత్త పాన్ ఇండియా స్టార్స్ ని చేసింది.
పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకోవడం ఒక విషయం అయితే.. దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించడం మరొక విషయం అని చెప్పాలి. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన RRR హీరోలలో.. చరణ్ దాన్ని కాపాడుకునేలా ముందుకు వెళ్తుంటే.. తారక్ మాత్రం దాన్ని సరిగ్గా వినియోగించుకోవడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి.
ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ వంటి స్టార్ డైరెక్టర్ తో ఓ భారీ మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్. ఇది అత్యధిక బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇప్పటికే కీలకమైన షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదే క్రమంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ #RC16 ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఇది పాన్ ఇండియా కాదు.. అంతకంటే పెద్దది అవుతుందని మేకర్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే లాంచ్ చేయనున్నారు. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ - సుకుమార్ వంటి పలువురు దర్శకుడు చెర్రీ లైనప్ లో ఉన్నారని తెలుస్తోంది.
ఇలా RRR తర్వాత రామ్ చరణ్ బ్యాక్ టూ బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు.. సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకూ తదుపరి మూవీ స్టార్ట్ చేయలేకపోయారు. గతేడాది పుట్టినరోజుకు అనౌన్స్ చేసిన NTR30 సినిమా.. ఇప్పటి వరకూ రెగ్యులర్ షూట్ కు వెళ్ళలేదు. అక్టోబర్ లో చిత్రీకరణ ప్రారంభిస్తారని టాక్ నడుస్తోంది కానీ.. క్లారిటీ రావడం లేదు.
సినిమాల విషయంలోనే కాదు.. ఎండార్స్‌మెంట్స్ మరియు యాడ్స్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ ముందున్నాడు. చెర్రీ ఇటీవల కాలంలో పలు బ్రాండ్స్ కు సైన్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా మరో మూడు పెద్ద బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ పై సంతకం చేసినట్లు సమాచారం.
ప్రకటనలు - ఎండార్స్‌మెంట్‌లు అనేవి కేవలం నటీనటులకు అదనపు డబ్బు తెచ్చిపెట్టడానికి మాత్రమే కాదు.. అవి స్టార్‌లను లైమ్ లైట్ లో ఉంచుతాయి. టీవీ కమర్షియల్ యాడ్స్ మరియు డిజిటల్ ప్రకటనలు నటీనటులను ఎల్లప్పుడూ జనాల్లో ఉంచుతాయి. అంతేకాదు స్టార్ల బ్రాండ్ ఇమేజ్ ని కూడా పెంచుతాయి.
ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్ వైపు మొగ్గు చూపిన టాప్ బ్రాండ్లు కూడా ఇప్పుడు పాన్ ఇండియా సర్క్యూట్ లో ప్రభావం చూపగలిగే సౌత్ స్టార్స్ వైపు చూస్తున్నాయి. అందుకే మహేష్ బాబు - అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ లకి ఈ మధ్య అనేక ఆఫర్లు వచ్చాయి.
అయితే RRR తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో పెద్దగా పురోగతిని చూపించలేదు. ఈ విధంగా చూసుకుంటే తారక్ వారికంటే కాస్త వెనకబడి ఉన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్రేజ్ ను క్యాష్ చేసుకునేలా యంగ్ టైగర్ ప్లాన్ చేసుకోవడం లేదని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.