ఎన్టీఆర్ తన సినిమా వేడుక చివర్లో లేదా మరే హీరో సినిమా వేడుకకు వెళ్లినా కూడా జాగ్రత్తగా వెళ్లండి... మీ కోసం మీ కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తున్నారు.. జాగ్రత్త జాగ్రత్త అంటూ పదే పదే అని చెప్తూనే ఉంటాడు. అయినా కూడా నందమూరి ఫ్యాన్స్ వేడుక అంటే ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంటుంది.
తాజా బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు అయిన పుట్ట సాయి రామ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. చిత్ర యూనిట్ సభ్యులు మృతి ని దృవీకరించడంతో పాటు.. అన్ని విధాలుగా సాయి రామ్ కుటుంబంను ఆదుకుంటాం అంటూ హామీ ఇచ్చారు.
సాయిరామ్ మృతి విషయంలో మాత్రం మిస్టరీ కొనసాగుతోంది. అసలు ఏం జరిగింది అంటూ సాయి రామ్ కుటుంబ సభ్యులతో పాటు నందమూరి అభిమానులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాయిరామ్ మృతికి కారణం ఏంటీ అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈవెంట్ నుండి డైరెక్ట్ గా ఉస్మానియా ఆసుపత్రికి సాయి రామ్ ను తీసుకు వెళ్లారు.
అసలు ఎవరు తీసుకు వెళ్లారు.. ఎలాంటి పరిస్థితుల్లో తీసుకు వెళ్లారు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. పోలీసులు ప్రస్తుతం ఎంక్వరీ మొదలు పెట్టారు. సాయి రామ్ ఒంటిమీద గాయాలు ఉన్నట్లుగా కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవి ఏంటి అనేది కూడా ఎంక్వయిరీ లో తెలియాల్సి ఉంది.
మొత్తానికి సాయి రామ్ మృతి అనేది చాలా పెద్ద మిస్టరీగా మారింది. ఇలాంటి వేడుకల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అలాంటి చోట వ్యక్తి మృతి చెందడం అంటే పెద్ద విషయం. మరి ఈ విషయంలో పోలీసుల ఎంక్వైరీ లో ఏం తేలబోతుందో చూడాలి.
మరో వైపు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్పందిస్తూ... సాయి రామ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నందమూరి ఫ్యామిలీ వీరాభిమానిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ వారు పేర్కొన్నారు.
అతని మృతికి సంతాపం తెలియజేయడంతో పాటు సాధ్యం అయినంత మేరకు అన్ని విధాలుగా సాయిరామ్ కుటుంబాన్ని ఆదుకుంటాం అంటూ బింబిసార యూనిట్ తరపున ఒక ప్రెస్ నోట్ వచ్చింది. అందులో సాయి రామ్ మృతి ఎలా జరిగింది అనే విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయమై ఎన్టీఆర్ వ్యక్తిగతంగా స్పందిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.