‘అరవింద సమేత’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ డిస్కషన్స్ లో ఉంది ఈ సినిమాకు. కాగా.. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నాడు త్రివిక్రమ్.
ప్రస్తుతం జూనియర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నాటికి ఈ సినిమా షూట్ మొత్తం కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు జక్కన్న. మధ్యలో జెమిని టీవీకి సంబంధించిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోకు సంబంధించిన షూట్ లో పాల్గొంటాడు తారక్.
కాగా.. ఈ సినిమాలో తారక్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. నేటి రాజకీయాలలో ప్రజలు ఎలా మోసపోతున్నారనే పాయింట్ మీద ఈ సినిమా నడవబోతోందట. అదేవిధంగా.. ఆధ్యాత్మిక అంశాలకు కూడా పెద్దపీట వేయబోతున్నాడట దర్శకుడు.
అంతేకాకుండా.. ఇందులో తారాగణం కూడా భారీగా ఉండబోతోందట. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడు. ఇంకా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీలో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. వీరిద్దరితోపాటు మరో హీరో జయరామ్, ఎన్టీఆర్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ కూడా కనిపిస్తున్నారట.
ఈ విధంగా భారీ కాస్టింగ్ తో వస్తున్న ఈ పొలిటికల్ డ్రామాను వచ్చే జూన్ లేదా జులై నుంచి మొదలు పెట్టబోతున్నారని టాక్. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది.