'అరవింద సమేత వీర రాఘవ' సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ పూర్తైన వెంటనే తారక్, త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడని అందరూ అనుకున్నారు. అయితే గత రెండు రోజులుగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తారక్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ 'ఆచార్య' చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాని కంప్లీట్ చేసి, ఇప్పటికే కమిటైన అల్లు అర్జున్ '#AA21' ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆగస్టులో రావాలని సన్నాహాలు చేసుకుంటున్న 'పుష్ప' కోవిడ్ నేపథ్యంలో లేట్ అయ్యే అవకాశాలు ఉండటంతో కొరటాల - బన్నీ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాకపోవచ్చని అంటున్నారు. దీంతో కొరటాల శివ 'ఆచార్య' తర్వాత కొన్ని నెలల పాటు అల్లు అర్జున్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ ఆలోచించుకున్న ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అవడంతో కొరటాలను లైన్ లో పెట్టాడని వార్తలు వస్తున్నాయి.
అప్పటికే దీని గురించి తారక్ - బన్నీ మాట్లాడుకుని కొరటాల శివ - ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకొచ్చారట. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మరియు కొరటాల శివ స్నేహితుడు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. దీని తర్వాత కొరటాల - అల్లు అర్జున్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ వార్తలు కనుక నిజమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్న మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 'NTR30' ప్రాజెక్ట్ తో ముడిపడి ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు తారక్ - త్రివిక్రమ్ కాంబోలో చేయబోయే సినిమాపై వీలైనంత త్వరగా ప్రకటన చేస్తే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది.