యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ జ్యోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. రిలీజైన పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయిన ఈ చిత్రం.. లాభాల బాట పట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లను సాధించడంతో హిందీ డిస్ట్రిబ్యూటర్, పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ ముంబైలో గ్రాండ్ గా సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం హాజరు అయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ వన్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది.
విదేశాలకు చెందిన బ్రాండెడ్ వాచ్ పటేక్ ఫిలిప్ నాటిలస్ 5712 1/ఎ(Patek Philippe Nautilus 5712 1/A) ను ధరించి సక్సెస్ పార్టీలో ఎన్టీఆర్ దర్శనమిచ్చాడు.
ఇంకేముంది ఆ వాచ్ కాస్త కెమెరా కంటికి చిక్కడంతో క్లిక్ మనిపించింది. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారగా.. ఎన్టీఆర్ పెట్టుకున్న ఆ కొత్త వాచ్ ఖరీదు ఎంతై ఉండొచ్చు అనే చర్చలు మొదలయ్యాయి.
వాస్తవానికి ఎన్టీఆర్ కార్లను, వాచ్ లను అమితంగా ఇష్టపడుతుంటాడు. వాటి కోసం కోట్లు ఖర్చు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే తన కొత్త వాచ్ పటేక్ ఫిలిప్ నాటిలస్ 5712 1/ఎ కోసం ఏకంగా రూ. 1.70 కోట్లు వెచ్చించాడట. ఈ బ్రాండ్‌లో లభించే ప్రతి వాచ్ కూడా ఖరీదైనదే అని అంటున్నారు. ఏదేమైనా ఒక వాచ్ కోసం ఎన్టీఆర్ కోటి 70 లక్షలు ఖర్చు పెట్టడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించాడు. 'ఎన్టీఆర్ 30' వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనూ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.