యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రంపై కమ్ముకున్న నీలి నీడలు గురించి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ టేకప్ చేసిన ప్రాజెక్ట్ ముందుకు కదడలడం లేదు. లాంఛనంగా ప్రారంభమైతే జరిగింది గానీ...ఇప్పటివరకూ సెట్స్ కి వెళ్లింది లేదు. ఈ విషయంలో అదిగో తోక ఇదిగో పులి అన్న చందంగా ప్రచారం తప్ప! అసలు సంగతేంటి? అన్నది క్లారిటీ రావడం లేదు.
స్ర్కిప్ట్ దగ్గరే ప్రాజెక్ట్ పెండిగ్ పడుతుందన్నది మాత్రం జోరుగా సాగుతోన్న ప్రచారం. కొరటాలపై ఆచార్య ప్లాప్ ప్రభావం...టైగర్ పై `ఆర్ ఆర్ ఆర్` పాన్ ఇండియా ఇమేజ్ నడుమ పొంతన తేడా వస్తుందన్నది అంతే బలంగా వినిపిస్తోన్న మాట. ఇంకా రకరకాల ప్రచారాలు నెట్టింట సాగాయి. ఇందులో ఏది నిజం? ఏది అబద్దం? అన్నది తెలియదు గానీ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.
ఈనేపథ్యంలో తాజాగా మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఇప్పటివరకూ స్ర్కిప్ట్ ఫైనల్ కాలేదంటున్నారు. ఫస్ట్ హాఫ్ వరకూ తారక్ సంతృప్తిగా ఉన్న సెకెండాఫ్ విషయంలో తారక్-కొరటాల మధ్య కన్విన్సింగ్ కుదరడం లేదంటున్నారు. ప్రధమార్థం కథ వరకూ తనకెలాంటి ప్రోబ్లమ్ లేదని..ద్వితియార్ధానికి వచ్చేసరికి కొరటాల ఎటు టర్న్ తీసుకున్నా? తారక్ ని ఒప్పించడం కొరటాలకు కత్తిమీద సాములా మారిందంటున్నారు.
కొరటాలతో పాటు తారక్ సైతం స్ర్కిప్ట్ చర్చ్ లో పాల్గొన్నా? ఓ పట్టాన సెకెండ్ హాఫ్ విషయంలో తారక్ ని మెప్పించడం కష్టంగా మారుతోందిట. అవసరంమేర తారక్ సలహాలు ఇస్తున్నా? ఆ రకంగా సెకెండాఫ్ ని సిద్దం చేస్తున్నా? తారక్ అసంతృప్తిగానే ఉంటున్నాడుట. కొరటాల నుంచి ఇంకేదో ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్లు..దాన్ని శివ 100 శాతం తీర్చి దిద్దడంలో విఫలమవుతున్నాడని వినిపిస్తోంది.
ద్వితియార్ధం విషయంలోనే ఇద్దరి మధ్య సీరియస్ గా చర్చోపచర్చలు సాగుతున్నా? విసుగు చెంది కొరటాల స్పాట్ నుంచి వెల్లిపోవడం తప్ప! తారక్ మనసు మెప్పించలేకపోతున్నాడని గుసగుస గట్టిగానే వినిపిస్తుంది. అది సాధ్యమైసనప్పుడే టైగర్ 30 సెట్స్ కు వెళ్తుందని..అంతకు వరకూ ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయని ఫిలిం సర్కిల్స్ లో సైతం చర్చకొస్తుంది.
కన్విన్స్ చేయడం ఇబ్బంది అయినంత మాత్రాన తారక్ కొరటాలని వదిలి వెళ్లే ఛాన్స్ లేదన్నది గట్టిగానే వినిపిస్తుంది. కొరటాల తారక్ మంచి స్నేహితుడు. అతన్ని తారక్ కుటుంబ సభ్యుడిలా భావిస్తాడు. కొరటాల డైరెక్టర్ అవ్వడంలో తారక్ రోల్ కొంత వరకూ ఉంది. కాబట్టి టైగర్ 30 ఇప్పట్లో తేలే అవకాశం లేదని...వచ్చే ఏడాదే ఆ సినిమా ప్రారంభం అవుతుందన్నది కొంతమంది బలమైన వాదన. మరి అసలు సంగతేంటి? అన్నది తేలాలంటే సీన్ లో తారక్..కొరటాల దిగాల్సిందే.