లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు ఉన్నాయి. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు అయితే రాదు కానీ పారితోషికం విషయంలో మాత్రం మరీ కఠినంగా వ్యవహరిస్తుందని.. చివరి షెడ్యూల్ లో పాల్గొనాలి అంటే పారితోషికం మొత్తం క్లీయర్ అయ్యి ఉండాల్సిందే అంటూ ఆమె కండీషన్స్ పెడుతుందని ఆమె గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది.
తాజాగా గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి సవతి సోదరి పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. పవర్ ఫుల్ లేడీ పాత్రలో నయన్ నటించి మెప్పించింది. సినిమాకు హిట్ టాక్ దక్కింది.. ఆ టాక్ లో నయన్ పాత్ర తప్పకుండా ఉంటుందని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలోనే గాడ్ ఫాదర్ సినిమా నిర్మాతల్లో ఒకరైనా ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ నయనతార గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమె పారితోషికం విషయంలో కఠినంగా ఉంటుందంటూ వచ్చిన వార్తలు నిజం కాదని తెలియజేశాడు. గాడ్ ఫాదర్ సినిమా విషయంలో ఆమె పారితోషికం గురించి ఎక్కువ మాట్లాడలేదు అంటూ ఆయన తెలియజేశాడు.
గాడ్ ఫాదర్ సినిమా షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత నయనతార ఒక సన్నివేశం కోసం రమ్మంటూ పిలిచాం. అప్పటికి ఆమె పారితోషికం బ్యాలెన్స్ ఉంది. అయినా కూడా ఆమె వచ్చి నటించి వెళ్లారు. పారితోషికం విషయంలో నయనతార మరీ కఠినంగా వ్యవహరించదని ఆయన పేర్కొన్నాడు.
చిరంజీవి సినిమా కనుక పారితోషికం విషయంలో పట్టింపు లేకుండా వ్యవహరించి ఉంటుంది.. ఇతర చిన్న హీరోల సినిమా ల్లో నటించడానికి నిర్మాత వద్ద ముక్కు పిండి మరీ పారితోషికం వసూళ్లు చేస్తూ ఉంటుందని ఇప్పటికి కూడా కొందరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
చిరు సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అయ్యి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.