సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తెలుగు సినీ పరిశ్రమనే కాదు అభిమానులను, సినీ ప్రేక్షకులను శోక సముద్రంలో పడేసింది. వెండితెర మీద ఆయన చేసిన సాహసాలను గుర్తు చేసుకుంటూ కృష్ణ గారి మరణ వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. ఇక మహేష్ ని చూస్తే ఎవరికైనా సరే గుండె తరుక్కుపోతుందని చెప్పొచ్చు. ఒకే ఏడాది తన జీవితంలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులను కోల్పోయాడు మహేష్.
జనవరి 8న మహేష్ సోదరుడు సూపర్ స్టార్ కృస్ష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందారు. రమేష్ బాబు మరణ వార్తే కృష్ణ గారిని చాలా క్రుంగిపోయేలా చేసింది. ఇక రెండు నెలల క్రితం కృష్ణ గారి మొదటి భార్య ఇందిరా దేవి కూడా తుదిశ్వాస విడిచారు. తొమ్మిది నెలల గ్యాప్ తోనే కొడుకు, భార్యని కోల్పోయిన కృష్ణ గారు మానసికంగా మరింత బలహీనపడేలా చేసింది. ఆదివారం కృష్ణ గారికి గుండెపోటు రావడంతో కాంటినెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసినా సరే కృష్ణ గారిని కాపాడలేకపోయారు.
ఈ ఏడాది మహేష్ అన్న, అమ్మలతో పాటుగా తనకు అన్ని తానైన తండ్రి కృష్ణ గారిని కూడా కోల్పోయాడు. 2022 ఘట్టమనేని ఫ్యామిలీకి ఒక బ్యాడ్ ఇయర్ అని చెప్పొచ్చు. అన్న, తల్లి మరణంతో కొద్దిగా డిస్ట్రబ్ అయిన మహేష్ తన మార్గదర్శకుడు..
తనని స్టార్ గా నిలబెట్టిన తండ్రి కృష్ణ మరణంతో మహేష్ కి వచ్చిన కష్టం మరెవరికి రాకూడదు.. మహేష్ ని నట వారసుడిగా చేయాలని చైల్డ్ ఆర్టిస్ట్ గానే పరిచయం చేసిన కృష్ణ అప్పటినుంచి మహేష్ ని సపోర్ట్ చేస్తూ తన తర్వాత మహేష్ ని సూపర్ స్టార్ గా చేశారు.
మహేష్ కి అభిమానుల నుంచి సపోర్ట్.. ఈ ఏడాది మహేష్ తన ఫ్యామిలీలో ముగ్గురిని కోల్పోవడంతో మహేష్ వెంట అభిమానులు నిలిచారు. స్టే స్ట్రాంగ్ అన్నా నీ వెంట మేమంతా ఉన్నాం అంటూ సోషల్ మీడియాలో స్టే స్ట్రాంగ్ మహేష్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఎవరెంత చెప్పినా సరే మహేష్ కి ఇది ఎవరు తీర్చలేని లోటు. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల పరిశ్రమ పెద్దలంతా సంతాపం తెలియచేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.