గుర్తుందా..? సరిగ్గా ఏడాది కిందట ఇదే సమయానికి ఏం జరిగిందో? దేశమంతా దేని గురించి చర్చించుకుందో? సినీ ప్రియులు ఎలా ఉద్వేగంతో ఊగిపోయారో? ఇండియన్ బాక్సాఫీస్ ఎలా బద్దలైందో? తెలుగు సినిమా ఎలా తలెత్తుకుని నిలబడిందో? థియేటర్లు ఎలా జనాలతో పోటెత్తాయో? పత్రికల్లో.. టీవీ ఛానెళ్లలో.. వెబ్ మీడియాలో.. సోషల్ మీడియాలో.. ఇలా దేశవ్యాప్తంగా ప్రతి మీడియాలో దేని గురించి చర్చోపచర్చలు జరిగాయో? ఇంకా ఆలోచించేదేముంది? ఏడాది కిందట ఇదే సమయంలో బాహుబలి: ది కంక్లూజన్ విడులైంది. 2017 ఏప్రిల్ 28ని భారతీయ సినీ చరిత్రలో చాలా ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయేలా చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని మేనియా చూశారు అందరూ.
నాటి ఆ ఉద్వేగం గురించి.. ఆ వసూళ్ల ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా విడుదలైంది ఏప్రిల్ 28నే అయినప్పటికీ ముందు రోజు రాత్రి సెకండ్ షో నుంచే ప్రత్యేక ప్రదర్శనలు మొదలైపోయాయి. అర్ధరాత్రికే టాక్ బయటికి వచ్చేసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోయింది. ఇక సినిమాలో ఎన్ని విశేషాలు.. ఎన్ని అద్భుతాలు.. ఎన్ని మెరుపులు.. ముఖ్యంగా విరామ సమయానికి ముందు వచ్చే పట్టాభిషేక ఘట్టం కలిగించిన ఉద్వేగం గురించి ఏం చెప్పాలి? అలాంటి అనుభూతి మరే సినిమాలోని సన్నివేశమైనా కలిగించిందా అంటే సందేహమే. విశేషం ఏంటంటే.. ‘బాహుబలి-2’ విడుదలై ఏడాదవుతున్నా ఇంకా దాని ప్రకంపనలు కొనసాగుతున్నాయి. జపాన్‌లో ఆ చిత్రం వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుని ఇంకా బాగానే ఆడుతోంది. ప్రస్తుతం రాజమౌళి - శోభు యార్లగడ్డ అక్కడే ఉండటం విశేషం. ఇంకో వారం రోజుల్లో చైనాలోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.