తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో సిద్దార్థ్ మరియు జీవి ప్రకాష్ లు హీరోలుగా నటించిన తమిళ చిత్రం తెలుగులో 'ఒరేయ్ బామ్మర్థి'గా డబ్బింగ్ అవ్వబోతుంది. తెలుగు ప్రేక్షకులు సూపర్ హిట్ చేసిన తమిళ డబ్బింగ్ చిత్రం బిచ్చగాడు కు దర్శకత్వం వహించిన శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. తెలుగులో సిద్దార్థకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో 'ఒరేయ్ బామ్మర్ధి' ని టాలీవుడ్ లో భారీగానే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఒరేయ్ బామ్మర్థి అంటూ ఈ సినిమా కు టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ టైటిల్ ను చూసి నెటిజన్స్ అరేయ్ ఎంట్రా ఇది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
'ఒరేయ్ బామ్మర్థి' టైటిల్ విషయంలో భిన్న వాదనలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే కొందరు భలే టైటిల్ పట్టారే అంటున్నారు. ఇక ఈ డబ్బింగ్ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో సిద్దార్థను ట్రాఫిక్ పోలీస్ గా చూడవచ్చు. మరో వైపు జీవీ ప్రకాష్ ను బైక్ పై చాలా స్పీడ్ గా వస్తున్నట్లుగా చూపించారు. వీరిద్దరి మద్య సంఘర్షణ ఆధారంగా ఈ సినిమా రూపొంది ఉంటుందని ఫస్ట్ లుక్ ను బట్టి అర్థం అవుతోంది. సిద్దార్థ్ మరియు జీవీ ప్రకాష్ కుమార్ ల మద్య సాగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు 'ఒరేయ్ బామ్మర్థి' రాబోతున్నట్లుగా చెబుతున్నారు.