తెలుగు తెరపై విలనిజం ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. అలాంటి తెరపై తనదైన విలనిజాన్ని చూపించి మెప్పించిన విలన్ గా సంపత్ రాజ్ కనిపిస్తారు. సంపత్ రాజ్ అంటే చాలామందికి వెంటనే గుర్తుకు రాకపోవచ్చు .. కానీ 'మిర్చి' సంపత్ అనగానే ఆయన రూపం కళ్లముందు కదలాడుతుంది. ప్రభాస్ వంటి హీరోని ఎదురుగా పెట్టుకుని, చాలా సింపుల్ గా కనిపిస్తూనే పవర్ఫుల్ విలనిజాన్ని చూపించిన ఆయన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఆయన కళ్లలోను .. డైలాగ్స్ లోను కనిపించే కాన్ఫిడెన్స్ కి ఎక్కువ మార్కులు పడిపోయాయి.
అలాంటి సంపత్ రాజ్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "సినిమాల్లోకి రావడానికి ముందు నేను బిజినెస్ చేసేవాడిని. అయితే మొదటి నుంచి కూడా నాకు సినిమాల్లోకి వెళ్లాలని ఉండేది. కానీ ఆ విషయం మా అమ్మతో చెప్పాలంటే భయం. ఎందుకంటే సినిమాలపై ఆమెకి మంచి అభిప్రాయం ఉండేది కాదు. ఏ పనీ పాటా లేనివారే సినిమాల్లోకి వెళతారనేది ఆమె నమ్మకం. అందువలన ఆమె దగ్గర సినిమాల ప్రస్తావన తెచ్చేవాడిని కాదు.
ఈ విషయాన్ని మా నాన్నగారు గమనించారు. ఆయన ఆర్మీలో పనిచేసినప్పటికీ చాలా సాఫ్ట్ గా ఉండేవారు. "ఒరేయ్ మీ అమ్మకి భయపడుతూ నువ్వు ఇలాగే ఉంటే ఎప్పటికీ సినిమాల్లోకి వెళ్లలేవు .. ఇంట్లో నుంచి పారిపో. సినిమాల్లో అవకాశాలు వచ్చేవరకూ ఏదైనా పనిచేసుకుంటూ వెళ్లు అని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే బిజినెస్ చేసుకుంటూ .. సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తూ వెళ్లాను. నేను యాక్టర్ ను కావడం .. తమిళంలో నేను చేసిన 'సరోజ' అనే సినిమా పెద్ద హిట్ కావడం మా అమ్మ చూసింది.
అయితే నేను తెలుగు సినిమాలు చేయడం .. 'మిర్చి' సినిమాతో హిట్ కొట్టడం ఆమె చూడలేదు. అప్పటికి ఆమె చనిపోయింది. నేను చేసిన 'మిర్చి' సినిమా మా అమ్మ చూసి ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఉండేవాడిని. ఇక కన్నడ సినిమాలో నా ఎంట్రీ కూడా గమ్మత్తుగా జరిగింది. ఒక సినిమా ఆడిషన్స్ కి నా ఫ్రెండ్ వెళ్లాడు .. కానీ వాడు సెలెక్ట్ కాలేదు. ఆ పాత్రకి నేను సెట్ అవుతానని వాడికి అనిపించింది. ఆ విషయాన్ని చెప్పి వాడు నన్ను పంపించడం .. నేను సెలెక్ట్ కావడం జరిగిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.