హాలీవుడ్ నే ఢీకొట్టేంత స‌త్తా మ‌న స్టార్ల‌కు ఉందిలే

Update: 2020-09-22 07:30 GMT
హాలీవుడ్ సినిమాలు అమెరికా స‌హా ప్ర‌పంచ‌దేశాల్లో రిలీజై సంచ‌ల‌న వ‌సూళ్లు సాధిస్తుంటాయి. బిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ అన్న మాట అక్క‌డ‌ మాత్ర‌మే సాధ్యం. 2018-19 సీజ‌న్ లో బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌తో చాలా సినిమాలు సంచ‌ల‌న విజ‌యాలు సాధించ‌డం అన్న‌ది అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యింది. 2020-25 సీజ‌న్ లో ఇండియన్ సినిమా మార్కెట్ అంత‌కంత‌కు పెరుగుతుంద‌నే ఆశించారు. కానీ ఈలోగానే సినీప‌రిశ్ర‌మను క‌రోనా మ‌హ‌మ్మారీ స‌ర్వ‌నాశ‌నం చేసిన సంగ‌తి విధిత‌మే.

ఈ ప‌రిణామం భార‌తీయ సినిమాపైనా తీవ్ర దుష్ప్ర‌భావం చూప‌నుంద‌నే చ‌ర్చ సాగుతోంది. ప్ర‌పంచ దేశాల్ని ఆర్థికంగా మాన‌సికంగా చావు దెబ్బ‌తీసిన చైనా అన్ని మార్కెట్ల‌పైనా ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తోంది. ఈ విష‌యాన్ని ఆదిలోనే గ‌మ‌నించిన ప్ర‌పంచ దేశాలు చైనా యాప్ ‌ల‌ని బ్యాన్ చేయ‌డం మొద‌లైంది. ముఖ్యంగా అమెరికాతో పాటు మ‌న దేశంలోనూ చైనా యాప్ ల‌ని నిషేధించ‌డం ఓ భారీ ముంద‌డుగుగా చెప్పుకోవ‌చ్చు. వ్యాపార ఒప్పందాల్ని వెంట‌నే ర‌ద్దు చేసుకోలేక‌పోయినా క్ర‌మ క్ర‌మంగా అటు వైపుగా అడుగులు వేయాల‌ని చూస్తోంది భార‌త స‌ర్కార్‌. ఈ నేప‌థ్యంలో దాని ప్ర‌భావం చైనాలో విస్త‌రించాల‌న్న బాలీవుడ్ స‌హా ఇండియ‌న్ సినిమా మార్కెట్ పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

బాలీవుడ్ చిత్రాలకు చైనాలో భారీ మార్కెట్ ఏర్ప‌డింది. మ‌న సినిమాల‌కు అక్క‌డి వారు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో కాసుల వ‌ర్షం కురుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ చిత్రాలను విప‌రీతంగా అభిమానిస్తున్నారు. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో భార‌తీయ‌ చిత్రాలు ఇక‌పై చైనాలో విడుద‌ల‌య్యే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఇండియాకు - చైనా కు మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా అప్ర‌క‌టిత యుద్ధం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆమీర్ ‌ఖాన్ న‌టిస్తున్న `లాల్ సింగ్ చ‌ద్దా`చిత్రాన్నిచైనాలో రిలీజ్ చేస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అన్న చ‌ర్చ సాగుతోంది.

మ‌రోవైపు చైనాలో మ‌న సినిమాల రిలీజ్ ల‌కు అడ్డంకి లేక‌పోతే మ‌న స్టార్లు కూడా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల స్టార్ల‌కు ధీటుగా ఎదిగే ఛాన్సుంటుంద‌ని ఇంత‌కుముందు అంచ‌నా వేశారు. అమీర్ ఖాన్... స‌ల్మాన్ ఖాన్.. ప్ర‌భాస్ లాంటి అగ్ర శ్రేణి క‌థానాయ‌కుల సినిమాల‌కు చైనాలోనూ డిమాండ్ పెరిగేది. కానీ తాజా వార్ ప‌రిణామాలు అన్నిటికీ ఇబ్బందిక‌రంగా మారాయ‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.
Tags:    

Similar News