నివేతతో విశ్వక్ సేన్ రొమాన్స్.. ఏప్రిల్ 1న సాంగ్ రిలీజ్!

Update: 2021-03-30 17:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా మేకింగ్ స్టైల్ మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు ఏడాదికి ఒకే సినిమా రిలీజ్ చేసే హీరోలు.. ఇప్పుడు ఏడాది రెండు నుండి మూడు సినిమాలు కూడా చేస్తున్నారు. అలాగే డైరెక్టర్స్ కూడా మేకింగ్ పరంగా వేగం పెంచారు. ప్రస్తుతం 'ఫలకనుమా దాస్' యువహీరో విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా పాగల్. హిట్ సినిమా తర్వాత రూట్ మార్చి లవ్ స్టోరీతో సిద్ధం అవుతున్నాడు విశ్వక్. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలో ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్స్.. సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖలతో రొమాన్స్ చేస్తున్నాడు విశ్వక్. అదేవిధంగా ఈ సినిమాలో మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా పాగల్ సినిమాలో మరో హీరోయిన్ చేరనుంది. ఆమె ఎవరో కాదు యంగ్ బ్యూటీ నివేత పేతురాజ్. అయితే అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాలో నివేతతో విశ్వక్ అసలు రొమాన్స్ చేయనున్నాడట. వీరిద్దరి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ఉందట. ఆ పాటకు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూస్తే నివేత, విశ్వక్ ఇద్దరు కూడా రోడ్ పై నడుచుకుంటూ వెళ్తున్నారు. 'సరదాగా కాసేపైనా' అనే టైటిల్ తో ఏప్రిల్ 1న లిరికల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. చూస్తుంటే ఈ సినిమాలో నివేత పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందని టాక్. అయితే ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ రధన్ సంగీతం అందిస్తున్నాడు. నరేష్ కుప్పిలి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.


Tags:    

Similar News