నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ‘పావై కధైగల్ - స్టోరీస్ ఆఫ్ సిన్` పాజిటివ్ సమీక్షలను అందుకుంది. ట్యాలెంటెడ్ వేట్రిమారన్ దర్శకత్వం వహించిన నాలుగు చిన్న కథలలో ఒకటైన సాయి పల్లవి నటనపైనా ప్రశంసల జల్లు కురుస్తోంది. రౌడీ బేబీ డిజిటల్ వరల్డ్ ని షేక్ చేసే నటనతో అలరించిందనేది క్రిటిక్స్ కితాబు.
కులాంతర వివాహం చేసుకుని తల్లిదండ్రుల నుండి విడిపోయే అమ్మాయిగా.. గర్భవతిగా ఛాలెంజింగ్ పాత్రలో సాయిపల్లవి నటన ఆద్యంతం రక్తి కట్టించింది. ఆమె తన పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయి నటించింది. తన బాడీ లాంగ్వేజ్ ప్రతి బిట్ నిజమైన గర్భిణీ స్త్రీని తలపించిందన్న ప్రశంసలు కురుస్తున్నాయి.
పరువు హత్య చుట్టూ తిరిగే కథతో చాలా కష్టతరమైన పాత్రలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కగా.. ఇందులో సహజ సిద్ధమైన నటనతో సాయిపల్లవి కట్టిపడేసింది. మరోసారి తనని తాను మంచి నటిగా ఆవిష్కరించుకునే అరుదైన అవకాశాన్ని సాయిపల్లవి సద్వినియోగం చేసుకుందని క్రిటిక్స్ కితాబిచ్చేస్తున్నారు. చిన్న పాత్ర అయినా నటిగా తన పరిధిని చూపించింది. ఫిదాలో భానుమతిగా .. ఆ తర్వాత ధనుష్ సరసన రౌడీ బేబీగా అలరించిన సాయి పల్లవికి మరో మంచి పేరు తెచ్చే ఆఫర్ దక్కిందని విశ్లేషిస్తున్నారు.