బాహుబలి అంచులు కూడా తాకలేదు

Update: 2018-02-05 07:20 GMT
సినిమాలో విషయం కంటే వివాదాలతోనే ఎక్కువ ప్రచారం జరిగిన సంజయ్ లీలా భన్సాలీ పద్మావత్ మీద వసూళ్ళ పరంగా బాహుబలిని టచ్ చేస్తుందా లేక ఓవర్ టేక్ చేస్తుందా అనే దాని గురించి రకరకాల ఊహగానాలు చెలరేగాయి. ఒకదశలో రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది అని కూడా ఆశించారు. కాని వాస్తవంగా పద్మావత్ బాహుబలి 2 దరిదాపులలోకి కూడా వెళ్ళలేకపోయింది. కర్ణి సేన వ్యతిరేకత మూలంగా కొన్ని ముఖ్య కేంద్రాల్లో విడుదల ఆలస్యం అయినప్పటికీ విడుదలైన వాటితో లెక్క వేసి చూసుకున్నా బాహుబలి 2ని టచ్ చేసే సాహసం చేయలేకపోయింది. చారిత్రాత్మక కథాంశం అయినప్పటికీ పూర్తి వాస్తవాలు చూపలేదు అనే టాక్ రావడం, కట్టిపడేసే డ్రామా కన్నా బరువైన ఎమోషన్స్ మీదే భన్సాలీ ఎక్కువ దృష్టి పెట్టడం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఓవర్సీస్ లో బాగానే రాబడుతున్నా పది రోజుల రన్ తర్వాత చాలా చోట్ల స్లో అయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి.

ఇక లెక్కల విషయానికి వస్తే పద్మావత్ మొదటి పది రోజులు పూర్తి చేసుకున్నాక ఇప్పటి దాకా 192.2 కోట్లు రాబట్టగా బాహుబలి 2 ఒక్క హింది వెర్షన్ నుంచే పది రోజులకు గాను 327.25 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఏ మాత్రం పోలిక సాధ్యం కాని రీతిలో పద్మావత్ బాహుబలి కంటే వెనుకబడింది. రన్వీర్ సింగ్ - షాహిద్ కపూర్ - దీపికా పదుకునే లాంటి స్టార్లు, రాజమౌళి కంటే ఎక్కువ దర్శకత్వ అనుభవం ఉన్న సంజయ్ లీలా భన్సాలీ లాంటి మాస్టర్ డైరెక్టర్ ఉన్నప్పటికీ బాహుబలి మేజిక్ ని రిపీట్ చేయలేకపోయారు. సల్మాన్ ఖాన్ అంతటివాడే రెండు సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. అమీర్ ఖాన్ సైతం చైనా వసూళ్లను కలుపుకుని చెప్పుకున్నాడే తప్ప సోలోగా అయితే బాహుబలి 2 నే విన్నర్. కింద టేబుల్ చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది.

                             బాహుబలి 2               పద్మావత్

                              (కోట్లలో)                    (కోట్లలో)

మొదటి రోజు                   41                         24

రెండో రోజు                       40.5                      32

మూడో రోజు                     46.5                      27

నాలుగో రోజు                    40.25                    31

ఐదో రోజు                        30                         15

ఆరో రోజు                        26                         14

ఏడో రోజు                        22.8                      13

ఎనిమిదో రోజు                  19.8                      10.5

తొమ్మిదో రోజు                  26.5                      10

పదో రోజు                        34.5                      16

మొత్తం                         327.25                 192.5

పైన టేబుల్ చూసారుగా. మీకే అర్థమైపోతుంది. బాహుబలి 2 విడుదల అయ్యాక రోజుల వారిగా వసూళ్ళలో కొంచెం తేడా ఉన్నప్పటికీ మధ్యలో మళ్ళి పికప్ అందుకుని భారీ వసూళ్ళకు కారణం అయ్యింది. కాని పద్మావత్ విషయంలో మాత్రం అధిక శాతం డ్రాప్ కనిపిస్తోంది. వీక్ ఎండ్ బాగా రాబడుతున్న పద్మావత్ వీక్ డేస్ మాత్రం అంతగా ఇంప్రెస్ చేయలేకపోతోంది. సో బాహుబలి 2 బ్రేక్ చేయాలంటే అవతల కూడా బాహుబలినే ఉండాలేమో.
Tags:    

Similar News