పాన్ ఇండియా స్టార్ న‌మ్మ‌నంటున్నాడు

Update: 2022-03-07 06:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ దానిపై నాకు న‌మ్మ‌కం లేదంటున్నారు. మిగ‌తా వారికి వున్న న‌మ్మ‌కం త‌న‌కు లేద‌ని క్లారిటి ఇచ్చేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే... ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్‌'. ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేట‌ర్లోలో విడుద‌ల‌వుతుందా? ఎప్పుడెప్పుడు చూడాలా? అని గ‌త కొంత కాలంగా ప్ర‌భాస్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌భాస్ నుంచి సినిమా వ‌చ్చి దాదాపు మూడేళ్లు దాటుతోంది. ఈ నేప‌థ్యంలో త‌న సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందా? అని అభిమానుల‌తో పాటు స‌గ‌టు సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

దాంతో 'రాధేశ్యామ్‌' మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. చాలా కాలం త‌రువాత ప్ర‌భాస్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డం.. హాలీవుడ్ చిత్రాల‌ని త‌ల‌పించే స్థాయిలో భారీ బ‌డ్జెట్ తో సినిమాని నిర్మించ‌డం.. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ లు సినిమాపై మ‌రింత క్రేజ్ ని క్రియేట్ చేయ‌డంతో ఇప్పుడు 'రాధేశ్యామ్‌' వ‌ర‌ల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. యువీ క్రియేష‌న్స్ , టి సిరీస్ సంస్థ‌లు అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో విడుద‌ల‌వుతోంది.

ఇటీవ‌ల రిలీజ్ ట్రైల‌ర్ తో ముంబై వేదిగా చిత్ర బృందం 'రాధేశ్యామ్' రిలీజ్ ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించేశారు. ఇదే వేదిక సాక్షిగా సినిమా విశేషాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల్ని కూడా వెల్ల‌డించి ప్ర‌భాస్ షాకిచ్చారు. ఇటీవ‌ల ముంబైలో ప్ర‌చారం పూర్తి చేసిన ప్ర‌భాస్ టీమ్ తాజాగా హైద‌రాబాద్ లో ప్ర‌చారాన్ని స్పీడ‌ప్ చేసింది. ఈ సంద‌ర్భంగా ప‌లు మీడియా సంస్థ‌ల‌తో ముచ్చ‌టించిన ప్ర‌భాస్ షాకింగ్ విషయాల్ని బ‌య‌ట‌పెట్టారు.

'రాధేశ్యామ్‌'లో ప్ర‌భాస్ హ‌స్త‌సాముద్రికా (పాల్మిస్ట్‌) నిపుణుడిగా విక్ర‌మాదిత్య పాత్ర‌లో న‌టిస్తున్నారు. సెల‌బ్రిటీల నుంచి దేశ ప్ర‌దాని వ‌ర‌కు త‌ను చెప్పింది వింటార‌ట‌. ఎమ‌ర్జెన్సీ నాటి ప‌రిస్థితుల్ని కూడా ఈ చిత్రంలో లైట్ గా ట‌చ్ చేసిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. విధికి ప్రేమ‌కు మ‌ధ్య‌ జ‌రిగే యుద్ధం నేప‌థ్యంలో స‌రికొత్త బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని రూపొందించారు. జాత‌కాలు.. అవి నిర్ణ‌యించే ప‌రిస్థితుల కార‌ణంగా ఓ జంట ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది?.. చివ‌రికి విధి అంచ‌నాల‌ని ఎలా త‌ల‌కిందులు చేసి త‌న పంతం నెగ్గించుకుంది అన్న‌దే ఇందులో ప్ర‌ధాన ఇతివృత్తం.

అయితే 'రాధేశ్యామ్‌' చిత్ర క‌థ ఏ అంశం ప్ర‌ధనంగా సాగుతుందో ఆ అంశంపై అంటే జాత‌కాల‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని ప్ర‌భాస్ ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది. సినిమాలోని పాత్ర‌కు నేను పూర్తి భిన్నం అని చెప్పిన ప్ర‌భాస్ జ్యోతిష్యాన్ని తాను న‌మ్మ‌న‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే మిత్రుల నుంచి దీనికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ల్ని తాను తెలుసుకున్నాన‌ని, మ‌న నాలెడ్జ్ కి మించింది ఏదో ఉంద‌ని మాత్రం తాను న‌మ్ముతాన‌ని తెలిపారు. అయితే 'బాహుబ‌లి' అద్భుత‌మైన విజ‌యం త‌రువాత తాను విధిని, విశ్వాసాన్ని న‌మ్మ‌డం మొద‌లుపెట్టాన‌ని స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News