ఒక్కోసారి టైమింగ్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఇది డైరెక్టర్లకు బాగా వర్తిస్తుంది. వారిదగ్గర మంచి స్టొరీ ఉన్నా ఆ సమయంలో హీరోలందరూ బిజీగా ఉంటే ఏం చేస్తారు? అదే వాళ్ళ స్టొరీ కి తగిన హీరో కనుక దొరికితే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. రీసెంట్ గా డైరెక్టర్ పరశురామ్ 'గీత గోవిందం' తో బ్లాక్ బస్టర్ సాధించాడు. తన స్టొరీకి కి మించి విజయ్ దేవరకొండ నటన - క్రేజ్ రెండూ తోడవడంతో ఇక సినిమా రేంజ్ పూర్తిగా మారిపోయింది.
కానీ సినిమా స్టొరీ మొదట అల్లు అర్జున్ కు వినిపించాడట. మరి బన్నీ ఈ సినిమాను ఎందుకు చేయలేదు? ఇదే విషయం పరశూరామ్ ను ఒక రీసెంట్ ఇంటర్వ్యూ లో అడిగితే - తను అల్లు అర్జున్ కు ఈ స్టొరీ చెప్పిన టైమింగ్ రాంగ్ అని చెప్పాడు. బన్నీ ఆ సమయంలో 'సరైనోడు' సినిమాతో సూపర్ హిట్ సాధించాడు. ఒక మాస్ హీరోయిజం పీక్స్ లో ఉండే రోల్ చేసిన తర్వాత ఈ సాఫ్ట్ స్టొరీ చేయాలా వద్దా అనే అనుమానం కలిగిందట బన్నీకి. అదేవిధంగా పరశురామ్ కి కూడా 'సరైనోడు' తర్వాత బన్నీ ఇలాంటి స్టొరీ చేయడం కరెక్ట్ కాదని అనిపించిందట.
అయినా అల్లు అర్జున్ ఫ్యామిలీ తనకు ఈ సినిమా విషయంలో ఎంతో సహకారం అందించిందని వాళ్ళకు కృతజ్ఞతలు తెలిపాడు. అల్లు అర్జున్ కు ఈ సినిమా స్క్రిప్ట్ చాలా నచ్చిందని దాంతో స్క్రిప్ట్ దశలో జరిగిన డిస్కషన్స్ లో స్వచ్చందంగా పాల్గొన్నాడని తెలిపాడు.