అక్క ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ అయిపోయింది. బాలీవుడ్ ని దున్నేసి అటుపై హాలీవుడ్ కి వెళ్లిపోయింది. అప్పుడప్పుడు హిందీ సినిమాలు టైంపాస్ గా చేస్తూ పూర్తిగా దూరం కాకుండా మ్యానేజ్ చేస్తుంది. మరి దూరపు చెల్లి పరిణీతి చోప్రా పరిస్థితి ఏంట? అంటే అమ్మడు ఇంకా అంత ఫేమస్ కాలేదు. కెరీర్ ప్రారంభమై దశాబ్ధం ఇంకా అక్క తరహా వేగం అందకోలేదు.
రెండేళ్ల క్రితం స్పీడప్ అయినట్లు కనిపించింది గానీ..మళ్లీ ఒక్కసారిగా నెమ్మదించింది. నిన్నటి రోజున 'ఉంఛాయి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకి టాక్ పాజిటివ్ గానే వస్తుంది. మరి అంతిమంగా ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి. అలాగే క్యాప్సుల్ గిల్ అనే సినిమాలో సెట్స్ లోఉంది. ఈనేపథ్యంలో తాజాగా ఢిల్లీలో నిర్వహించిన అజెండా అజతక్ 2022 కార్యక్రమంలో పాల్గొన్న పరిణితి దక్షిణాది చిత్రాల ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'సౌత్ సినిమాల్లో నటించాలని ఎంతగా ఆశపడుతున్నానో... నా ఆరాటాన్ని మాటల్లో చెప్పలేను. చేతల్లో మాత్ర మే నిరూపించ గలను. తెలుగు..తమిళం..కన్నడం..మలయాళం ఏ భాషలోనైనా ఒక్క అవకాశం వస్తే చాలు. నటిగా నిరూపించుకోవడానికి సిద్దంగా ఉన్నాను. కానీ అది మంచి సినిమా అయి ఉండాలి. సరైన కథ..దర్శకుడు కుదిరితే మంచి ఔట్ ఫుట్ వస్తుంది.
అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. అలాంటి వాళ్ల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీకు అలాంటి దర్శకుడి గురించి తెలిస్తే నాచెవిన ఓ మాట వేసేయండి. అందులోనూ తెలుగు అవకాశం వస్తే ఇంకా సంతోషంగా ఫీలవుతాను ' అని తెలిపింది. మొత్తానికి పరిణీతి మనసులో మాటలన్నింటిని బట్ట బయట పెట్టేసింది.
సౌత్ లో అవకాశం కావాలని నోరు తెరిచి అడిగింది. టాలీవుడ్ ఛాన్స్ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నట్లు అర్ధమైంది. ఇలా ఓపెన్ గా మాట్లాడాలి అన్నా? ఎంతో ధైర్యం కావాలి. మరి పరిణీతిని పిలుపు ఎంత మంది చెవిన పడుతుందో చూడాలి.
ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతలంతా జాన్వీకపూర్..అలియాభట్ భామల చుట్టూనే జపం చేస్తున్నారు. వాళ్లేమో డేట్లు ఇవ్వరు. కానీ అవకాశాలివ్వడానికి మనోళ్లు రెడీగా ఉంటారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్న వాళ్లకి మాత్రం ఛాన్సులివ్వరు. అదే లాజిక్ మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.