శరత్ బాబుకు అది దేవుడు ఇచ్చిన వరం
ప్రముఖ నటుడు శరత్ బాబు ఇటీవలే అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఆయన మరణవార్త సినిమా పరిశ్రమ జీర్ణించుకోలేక పోతుంది. తెలుగు భాషలోనే కాకుండా అయిదు ఆరు భాషల్లో శరత్ బాబు సినిమాలు చేసి మెప్పించారు. సహజ నటుడు అంటూ అభిమానులతో పిలిపించుకున్నారు. ఆన్ స్క్రీన్ జమిందార్ అనే పేరును కూడా శరత్ బాబు పొందారు.
అలాంటి ప్రముఖ నటుడు శరత్ బాబు మృతి చెందడం పట్ల ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోను విడుదల చేయడం ద్వారా శరత్ బాబు గురించి పలు ఆసక్తికర విషయాలను పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడటం జరిగింది.
శరత్ బాబు మా ఇంటికి సమీపంలోనే ఉండేవారు. ప్రతి రోజు వాకింగ్ చేస్తున్న సమయంలో ఆయన కనిపించే వారు. ఆయన కనిపించిన ప్రతి సారి కూడా నవ్వుతూనే కనిపించే వారు.
ఆయనకు నవ్వు అనేది దేవుడు ఇచ్చిన వరం. నేను ఈ విషయాన్ని పలు సార్లు ఆయన వద్ద చెప్పాను. మీలా నవ్వడం మరెవ్వరికి కూడా సాధ్యం కాదు అన్నట్లుగా చెప్పేవాడిని.
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో శరత్ బాబు ను చూసిన సమయంలోనే ఆయన ఆరోగ్యం సరిగా లేదేమో అనిపించింది. ఆయన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అంటూ వార్తలు వచ్చిన సమయంలో ఆయన తిరిగి పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాను అన్నారు.
ఇండస్ట్రీకి చెందిన గొప్ప నటులు మరియు గొప్ప వ్యక్తులు ఇలా ఒక్కొక్కరు చొప్పున వెళ్లి పోవడం బాధ కలిగిస్తుంది అంటూ పరుచూరి వారు ఎమోషనల్ అయ్యారు. ఈ మధ్య కాలంలో వరుసగా ఇండస్ట్రీ దిగ్గజాలు తిరిగి రాని లోకాలకు వెళ్లడం ప్రతి ఒక్కరిని కలచి వేసింది.