పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక వైపున రాజకీయాలలో చురుకునైన పాత్రను పోషిస్తూనే .. మరో వైపున తన సినిమాలను చక్కబెడుతున్నారు. ఇక అప్పుడప్పుడు మాత్రమే ఆయన ఇతర సినిమాల ఈవెంట్స్ కి ముఖ్య అతిథిగా వేదికలపై కనిపిస్తున్నారు. అలా చాలా గ్యాప్ తరువాత ఆయన 'అంటే .. సుందరానికీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. " ఇందాకటి నుంచి చూస్తున్నాను .. ఉరకలేసే మీ ఉత్సాహం లేకపోతే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అందం ఉండదు.
'అంటే .. సుందరానికీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నన్ను ఆహ్వానించిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాని గారి నటన మాత్రమే కాదు .. ఆయన వ్యక్తిత్వం కూడా నాకు చాలా ఇష్టం. తాను నమ్మిన విషయం పై బలంగా నిలబడగలిగే వ్యక్తి ఆయన. భగవంతుడు ఆయనకి మరిన్ని విజయాలను అందించాలని కోరుకుంటున్నాను. అందరితో పాటు నేను కూడా నజ్రియాను తెలుగు తెరకి ఆహ్వానిస్తున్నాను. ఆమె నటన అద్భుతంగా ఉందని అందరూ చెబుతూ ఉంటే చూడాలని అనుకుంటున్నాను.
ఈ సినిమాలో ఇతర పాత్రలను పోషించిన నటీనటులకు .. సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దర్శకుడు వివేక్ ఆత్రేయ .. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ పనితీరు బాగుందనే విషయం అర్థమైపోతోంది.
తెలుగు చిత్రపరిశ్రమ ఒక్కరి సొత్తు కాదు .. ఇది అందరి సొత్తు. ఈ రోజున ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలబడగలిగే ధైర్యాన్ని అభిమానులు ఇచ్చారు .. తెలుగు చిత్రపరిశ్రమ ఇచ్చింది. ఇక్కడ ఎవరి ఆలోచనలు వారికి ఉండొచ్చు. సినిమా వేరు .. రాజకీయం వేరు .. ఆ స్పష్టత నాకుంది.
కళకి కుల మత ప్రాంతాలు ఉండవు. ఒక నజ్రియా .. ఒక నదియా .. ఇలా కళాకారులంతా ఆయా ప్రాంతాల .. రాష్ట్రాల నుంచి .. భాషల నుంచి వచ్చి పని చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లంతా వచ్చి చేసిన సినిమానే 'అంటే .. సుందరానికీ' అలాంటి ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. నాని గారికి మా ఇంట్లోనే చాలామంది అభిమానులు ఉన్నారు. విలక్షణమైన నటన .. విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్నవారాయన. నానితో పాటు దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా మంచి విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను.
త్వరలో మైత్రీ బ్యానర్లలో హరీశ్ శంకర్ తో కలిసి 'భవదీయుడు భగత్ సింగ్' నేను చేయబోతున్నాను. ఇందాక నేను వద్దని చెప్పినా నా AV వేశారు. ఇది నాని సినిమా కనుక ఆయన ముందు ఉండాలి .. నేను వెనుక ఉండాలి. AV లో నా డాన్సులు చూపించారు. డాన్సులు చేయడం నాకు ఇష్టం ఉండదు. మీ కోసం గన్ పాయింటులో పెట్టి దర్శక నిర్మాతలు చేయిస్తున్నారు. వెనక మ్యూజిక్ వస్తుంటే చక్కగా నడవడం నాకు ఇష్టం .. నాకు నడిచే అవకాశం ఇవ్వండి .. ఇక నేను డాన్స్ చేయలేను" అంటూ చెప్పుకొచ్చారు.