పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కు కమిట్ అయ్యాడు. కరోనా మరియు ఇతరత్ర కారణాల వల్ల రెండేళ్ల గ్యాప్ కాస్త మూడేళ్లు అయ్యింది. అజ్ఞాతవాసి విడుదల అయిన సరిగ్గా మూడు ఏళ్లకు వకీల్ సాబ్ తో పవన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా రూపొందుతున్న వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా మార్చి నుండి ఆగిపోయింది. గత నెలలో పవన్ లేకుండా కొన్ని సీన్స్ ను షూట్ చేశారు. పవన్ ఎప్పుడెప్పుడు షూటింగ్ లో ఎంటర్ అవుతాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా తర్వాత ఈ నెలాఖరు నుండి పవన్ షూటింగ్ కు హాజరు కాబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.
నవంబర్ మొత్తం కూడా వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొని గుమ్మడి కొట్టేయబోతున్నాడు. ఆ వెంటనే డిసెంబర్ నుండి క్రిష్ దర్శకత్వంలో సినిమాను పవన్ చేయబోతున్నాడు. వరుసగా నాలుగు సినిమాలకు కమిట్ అయిన పవన్ తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే వకీల్ సాబ్ కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఇచ్చాడు. క్రిష్ మూవీకి కూడా కేవలం నాలుగు నెలల సమయంను మాత్రమే దర్శకుడు ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా వరుసగా సినిమాలను పూర్తి చేసేందుకు గాను దసరా నుండి పవన్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. వచ్చే ఏడాది చివరి వరకు సాధ్యం అయినంత వరకు హరీష్ శంకర్ ఆ తర్వాత సురేందర్ రెడ్డి సినిమాను కూడా పూర్తి చేయాలని పవన్ ప్లానింగ్ చేశాడట. మరి ఈ ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లుగా అమలు అవుతుందా లేదంటే మళ్లీ గందరగోళం అవుతుందా అనేది చూడాలి.