మహేష్‌ విలన్ కోసం పవన్‌ ఎదురు చూపులు!!

Update: 2022-05-12 08:34 GMT
మహేష్ బాబు హీరోగా తెరకెక్కి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో విలన్ గా నటించిన సముద్రకని టాలీవుడ్ లో ఫుల్‌ బిజీ అయ్యాడు. విలన్ గానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈయన తెలుగు మరియు తమిళంలో నటుడిగా చాలా బిజీ అయ్యాడు. బేసిక్‌ గా దర్శకుడు అయిన సముద్రకని ఇప్పుడు డైరెక్షన్‌ చేసేందుకు సమయం లేనంతగా నటుడిగా బిజీ అయ్యాడు.

తమిళంలో ఈయన దర్శకత్వంలో తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వినోదయ్య సిత్తం సినిమా తెలుగు రీమేక్ కు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ పర్యవేక్షణ లో బుర్ర సాయి మాధవ్‌ రీమేక్‌ స్క్రిప్ట్‌ ను పవన్‌ కళ్యాణ్‌ కోసం రెడీ చేశాడు. స్క్రిప్ట్‌ దాదాపుగా రెడీ అవ్వడంతో సినిమాను మే లేదా జూన్ లో పట్టాలెక్కించాలని భావించారు.

ఈ రీమేక్ కు సముద్రకని దర్శకత్వం వహిస్తేనే బాగుంటుందని దర్శకుడు త్రివిక్రమ్‌ తో పాటు పవన్‌ కళ్యాణ్ కూడా భావించాడట. అందుకే ఆయన రాక కోసం వెయిట్‌ చేస్తున్నారు. తెలుగు మరియు తమిళంలో పలు సినిమాలకు కమిట్‌ అయిన సముద్రకని ఆగస్టు వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడట.

రీమేక్‌ కు దర్శకత్వం చేయమంటూ అడిగిన సమయంలో నో చెప్పకుండా బిజీగా ఉన్నానని ఆయన చెప్పాడట.

సముద్రకని కోసం పవన్‌ కళ్యాణ్ వెయిట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసింది. కనుక వినోదయ్య సిత్తం రీమేక్ మరియు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా లను ఒకే సారి చేయాలనే ఉద్దేశ్యంతో పవన్‌ కళ్యాణ్ ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.

కాస్త డేట్లు అడ్జస్ట్ చేసుకుని పవన్‌ కళ్యాణ్‌ తో సినిమాను జులై లేదా ఆగస్టు లో మొదలు పెట్టాలని సముద్రకని భావిస్తున్నాడట. అప్పటి వరకు పవన్ కూడా వెయిట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పవన్‌ కళ్యాణ్ డేట్ల కోసం దర్శకులు నిర్మాతలు వెయిట్‌ చేస్తూ ఉంటే.. సముద్రకని డేట్ల కోసం పవన్‌ కళ్యాణ్ వెయిట్‌ చేయడం విడ్డూరంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News