మనిషిలోని అంతర్లీనంగా ఉండే శక్తిని తెలుసుకునే సందర్భం ప్రతీ ఒక్కరికి వస్తుందంటూ.. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పాడు పవన్ కళ్యాణ్. తనకు అలాంటి సందర్భం తను నటించిన సుస్వాగతం మూవీ సక్సెస్ అయినపుడు వచ్చిందన్నాడు.
'సుస్వాగతం సినిమా పెద్ద హిట్ అయింది. కర్నూల్ లో ఒకే థియేటర్లో చాల రోజులు ఆడింది. అక్కడ ఫంక్షన్ కి నన్ను పిలిచారు. ఫంక్షన్ కి వెళ్లాలంటే నాకు ఇబ్బంది.. నాకు ఎప్పుడూ అన్నయ్య చిరంజీవి గారి ఫంక్షన్సే.. ఎప్పుడూ ఆయన అభిమానులే. అసలు నా ఉద్దేశ్యంలో నాకు ఎప్పుడూ ఆయనే హీరో.. నేను హీరోను కాదు. అందుకే అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ని అడిగాను. సినిమా అంటే చూశారు కానీ.. నన్ను చూడ్డానికి ఎవరొస్తారు అన్నాను. వద్దని అనుకున్నాను కానీ వాళ్ల ఇబ్బంది పడలేక వెళ్లాను. మళ్లీ రాకపోతే పొగరు.. అహంకారం అనుకుంటారు. అదేమీ కాదు.. నాకు ఇబ్బంది అని చెప్పలేకపోయేవాడిని' అన్నాడు పవన్.
'ఆరోజు నేను హోటల్ నుంచి బయటకు వచ్చినపుడు.. ఇక్కడి నుంచి థియేటర్ కి ఓ ఐదు కిలోమీటర్లు ఉంటుంది.. తీసుకెళ్తామంటే.. నేనేమన్నా గంగిరెద్దునా ఏంటి అన్నాను. అన్నయ్యగారైతే.. జనం చూపించే ప్రేమకు.. అన్నయ్య చెయ్యూపితే అందంగా ఉంటుంది.. నేను ఊపితే ఏముంటుంది. నన్ను బలిపశువును చేయద్దని కోరాను. అప్పుడే నా ఫ్రెండ్స్ కి చెప్పాను. కారు తీసుకురండి.. పక్క దారి నుంచి థియేటర్ కి వెళ్లిపోదాం అని చెప్పాను. అయితే.. బయటకొచ్చి చూస్తే అక్కడ రోడ్డంతా నిండిపోయింది' అన్నాడు పవన్
'అప్పుడు అంతమంది జనాలు చూస్తుంటే.. నాకు చెయ్యి ఊపండి పొగరు అనుకుంటారని చెప్పారు. అప్పటికే నేను భయంతో బిగుసుకుపోయాను. ప్రేమతో వారికి నమస్కారాలు చెప్పడం తప్ప ఏం చేయలేకపోయాను' అన్న పవన్ తన తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. 'భగవంతుడి సృష్టిలో వాళ్లెంతో నువ్వూ అంతే.. నీ ఒక్కడికే అనుకుంటే నాశనం అవుతావ్' అని తన తండ్రి చెప్పిన మాటలు మర్చిపోనన్న పవర్ స్టార్.. తనను అభిమానించినా.. అభిమానించకున్నా.. జీవం ఉన్నా.. జీవం లేకపోయినా ప్రతీ ఒక్కరికి.. ప్రతీ వస్తువుకూ శిరస్సు వంచి మొక్కుతున్నా' అని చెప్పాడు.
పవన్ కళ్యాణ్ నోటినుండి జారువాలిన ఈ మాటలు ఇప్పుడు అభిమాన లోకాన్ని కొత్త ఉత్సహాంలో ముంచెత్తుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/