పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్` సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల తర్వాత సాలిడ్ హిట్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసారు. పవన్ స్టామినా మరోసారి రుజువైంది. ఇదే వేవ్ లో మరికొన్ని చిత్రాలతోనూ పవన్ మెప్పించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో `హరి హరవీర మల్లు` చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
పీకే ని వెండి తెరపై సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ పనులు పూర్తిచేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో `భవధీయుడు భగత్ సింగ్` టైటిల్ తో మరో చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
`గబ్బర్ సింగ్` తర్వాత మరోసారి అదే కాంబినేషన్ చేతులు కలపడం తో సినిమాపై ప్రకటన నాటి నుంచే అంచానాలు ఆకాశన్నంటడం మొదలైంది. ఇలా పవర్ స్టార్ బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాలతో రావడంతో అభిమానుల ఆనంధానికి అవధులు లేవు.
తాజాగా ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి పీకే రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవన్ తమిళ ఫాంటసీ చిత్రం `వినోదయ్య సిత్రం` రీమేక్ కి గ్రీన్ సిగ్నెట్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా దర్శకత్వం బాధ్యతలు యంగ్ మేకర్ సుజిత్ కి అప్పగిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. యంగ్ ట్యాలెంట్ ని ప్రోత్సహించడంలో ముందుండే పవన్ మరోసారి అలాంటి వాళ్లకే అవకాశం కల్పించాలని సుజిత్ ని సెలక్ట్ చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇటీవల రిలీజ్ అయిన `భీమ్లా నాయక్` చిత్రాన్ని తెరకెక్కించిన సాగర్ కె. చంద్ర కూడా కొత్త మేకర్. తనలో అసాధారణ ప్రతిభ గుర్తించి పీకే ఆ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం కల్పించారు. అలా సుజిత్ లోనూ ఏదో ట్యాలెంట్ చూసే పవన్ అతని దృష్టిలో పడినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
మరి సుజిత్ ఫైనల్ అవుతారా? లేక మాతృక వెర్షన్ మేకర్ ని తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి. మాతృకలో ఈ చిత్రాన్ని స్వీయా దర్శకత్వంలో సముద్రఖని తెరకెక్కించారు. అక్కడ పెద్ద సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో డైరెక్షన్ ఛాన్స్ అతనికే అప్పగిస్తారని ప్రచారం సాగింది. కానీ తాజాగా సుజిత్ పేరు తెరపైకి రావడం విశేషం.