సినిమాటోగ్రాఫ‌ర్ ని ఆకాశానికెత్తేసిన ప‌వ‌న్

Update: 2021-11-13 06:16 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - ద‌గ్గుబాటి రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `భీమ్లా నాయ‌క్`. సాగ‌ర్ కె చంద్ర దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు మోష‌న్ టీజ‌ర్లు స‌హా ప్ర‌తిదీ అభిమానుల్ని ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా సాంగ్ గ్లింప్స్ యువ‌త‌రంలో ఊపు తెచ్చాయ‌నే చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమాకి ప‌ని చేసిన సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి.కె.చంద్ర‌న్ ని ప‌వ‌న్ ఆకాశానికెత్తేశారు. ఆయ‌న ఇప్ప‌టికే ఎడిట్ చేసిన‌ విజువ‌ల్స్ వీక్షించి ఎగ్జ‌యిట్ అయ్యార‌ట‌.

దీంతో ప‌వ‌ర్ స్టార్ స్వ‌యంగా ర‌వి కె చంద్ర‌న్ ని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. ``ప్రియ‌మైన ర‌వి.కె.చంద్ర‌న్ స‌ర్ మీ విజువ‌ల్ బ్రిలియ‌న్స్ కు భీమ్లా నాయ‌క్ లో భాగ‌మైనందుకు ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాలో కొత్త‌గా కీల‌క‌మైన బ్రిలియ‌న్స్ ని విజువ‌ల్స్ ప‌రంగా డిఫ‌రెన్స్ ని చూపించారు. మీకు ధ‌న్య‌వాదాలు`` అంటూ ప‌వ‌న్ ప్ర‌శంసించారు. భీమ్లా నాయ‌క్ సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. భారీ కాంపిటీష‌న్ ఉన్నా ప‌వ‌న్ అండ్ టీమ్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.




Tags:    

Similar News