అనురాగ్ కశ్యప్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పాయల్ ఘోష్ ఆరోపించాక.. అసలు ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో వివరాలు గుర్తుకు రాలేదా? అంటూ నెటిజనుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతకీ ఆ ప్రశ్నకు పాయల్ ఏమని జవాబిచ్చింది? అంటే..
అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన తరువాత #MeToo ఉద్యమం మరో లెవల్ కి చేరుకుంది. ఈ వివాదంపై ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. ఈ వివాదంలో బాలీవుడ్ డివైడ్ అయినట్టు కనిపిస్తున్నప్పటికీ.. ఈ సంఘటన జరిగిన తేదీని గుర్తుంచుకోకపోవడంపై చాలా మంది పాయల్ ను ప్రశ్నించారు. అనురాగ్ వేధింపుల వ్యవహారానికి సంబంధించి తన వద్ద రుజువు లేదని పాయల్ పేర్కొంది. అయితే తాజాగా నెటిజనుల ప్రశ్నలకు సమాధానంగా.. సరికొత్త వివరణతో ముందుకు వచ్చింది.
అనురాగ్ తన ప్రేమికుడు కానందున ఖచ్చితమైన తేదీ గుర్తు లేదని ఇటీవల పాయల్ సెటైరికల్ గా స్పందించారు. అయితే పోలీసులు ఆ రికార్డులను తిరిగి పొందగలిగితే చాలా విషయాలు స్పష్టంగా ఉంటాయని పాయల్ నొక్కి చెప్పింది. ``అతను నా ప్రేమికుడు కాదు. ప్రేమలో ఉన్నప్పుడు తేదీలు గుర్తుంటాయి. కానీ నేను ఆ దర్శకుడిని కలిసినప్పుడు తేదీ లేదా ఇంకేదైనా ఎలా గుర్తుంచుకుంటాను?`` అని టిఫికల్ ఆన్సర్ ఇచ్చింది. తేదీల గురించి మాట్లాడాల్సి వస్తే నవంబర్ లేదా డిసెంబర్ మధ్య అయ్యుండొచ్చు.. ఎందుకంటే 2015 లో ఆ ఘటన నాకు గుర్తుంది. ‘ఎందుకు మీరు నాతో పార్టీకి రారు? హోలీ పార్టీకి రండి’ అంటూ అతడే ఆహ్వానించాడు! అని తెలిపింది.
నాకు గుర్తులేనిది కనుగొనే పని పోలీసులు చేస్తారని నేను అనుకుంటున్నాను. వారు ఆ ఫోన్ సందేశాలు.. రికార్డులను తిరిగి పొందగలిగితే అప్పుడు ప్రతిదీ స్పష్టంగా ఉంటుందని పాయల్ అంది. ఇవన్నీ నిరాధారమైనవని ఇప్పటికే అనురాగ్ కశ్యప్ ఖండించిన సంగతి తెలిసిందే.