వేధింపుల కేసులో ద‌ర్శ‌కుడిపై ఎన్ని సెక్ష‌న్లు అంటే?

Update: 2020-09-23 05:00 GMT
వేధింపుల వ్య‌వ‌హారంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ మంగళవారం అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.  ఐపిసి సెక్షన్ 376, 354, 341, 342 కింద కేసు ఫైల్ చేశార‌ని ఘోష్ న్యాయవాది నితిన్ సాట్పుట్ జాతీయ మీడియాకి తెలియజేశారు.

``అత్యాచారం.. తప్పుడు వేధింపు.. నిర్బంధించడం మ‌రియు ఐపిసి U / S 376.. 354.. 341.. 342  సెక్ష‌న్ల కింద రాతపూర్వక ఫిర్యాదు నమోదైంది. ఇప్పుడు పోలీస్ స్టేష‌న్ లో బాధితుడి వాంగ్మూలం నమోదు చేయనున్నాం`` అని తెలిపారు.

అనురాగ్ కశ్యప్ 2014-15లో తనను బలవంతం చేశాడని పాయల్ ఘోష్ పేర్కొన్నారు. తనకు `హాని’ ఉంద‌ని రక్షణ కోరుతూ ప్రధాని మోదీని ఆమె ట్యాగ్ చేసింది. రిషి కపూర్-పరేష్ రావల్ నటించిన పటేల్ కి పంజాబీ షాదీ చిత్రంతో హిందీలో అడుగుపెట్టిన పాయ‌ల్ ఘోష్‌..క‌శ్య‌ప్ ప‌లువురిని లోబ‌రుచుకున్నాడ‌ని ఆరోపించింది.

ఐదేళ్ల క్రితం అవ‌కాశం కోసం అనురాగ్ కశ్యప్‌ను కలిశాను. అతను నన్ను తన ఇంటికి పిలిచాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు.. నన్ను ఒక ప్రత్యేక గదికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు ప్రయత్నించాడు. అతను నన్ను బలవంతం చేశాడు అని ఆరోపించారు పాయ‌ల్ ఘోష్‌.

అయితే ఈ ఆరోపణలను కశ్యప్ ట్విట్టర్లో ఖండించారు. అవి నిరాధారమైనవి` అని పేర్కొన్నారు. ఒక ట్వీట్‌లో దీనిని ‘అబద్ధాలు’ అని .. ‘బాధపడ్డాను’ అని ఒక ప్రకటన విడుదల చేశారు. లాయ‌ర్ స‌ల‌హా ప్రకారం చట్టంలో తన హక్కుల ప‌రిర‌క్ష‌ణకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని అన్నారు. మరోవైపు ఘోష్ జాతీయ మహిళా కమిషన్ లో అధికారిక ఫిర్యాదును నమోదు చేయడానికి సిద్ధమ‌వుతున్నార‌ని స‌మాచారం.
Tags:    

Similar News