తిక్క రేగ్గొడితే ఎలా జ‌వ‌రాలా ప్రియురాలా..!

Update: 2021-12-23 10:30 GMT
`తిక్క` చిత్రంతో ప‌రిచ‌య‌మైన విదేశీ బ్యూటీ లారెస్సా బోనెస్సీ. అందానికి అందం హాట్ కంటెంట్ తో మురిపించే ఈ బ్యూటీ ఇటీవ‌ల టాలీవుడ్ లో అవ‌కాశాల కోసం తీవ్రంగానే ప్ర‌యత్నిస్తున్నా ఆ ఒక్క ఛాన్స్ వ‌రించ‌డం అంత సులువేమీ కాద‌ని అర్థ‌మైన‌ట్టుంది. అయినా త‌న ప్ర‌య‌త్నాలు మాత్రం విర‌మించ‌డం లేదు.

ఇటీవ‌లే తిక్క కోస్టార్ సాయి తేజ్ యాక్సిడెంట్ అనంత‌రం విచారం వ్య‌క్తం చేసిన లారెస్సా త‌న ఫేవ‌రెట్ హీరో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లోనే అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. అక్క‌డ త‌న యాంబిష‌న్స్ గురించి వెల్ల‌డిస్తోంది. ఇన్ స్టా వేదిక‌గా లారిస్సా బికినీ షోలు.. స్విమ్మింగ్ ఫీట్లు నిరంత‌రం వేడెక్కిస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలాన్ని సునామీ స్పీడ్ తో చుట్టేస్తోంది. ఈ ఫోటోగ్రాఫ్ లో లారిస్సా ఫార్మ‌ల్ ష‌ర్ట్ ని ఓపెన్ చేస్తూ ఇన్న‌ర్ అందాల్ని ఆవిష్క‌రించిన తీరు మ‌తులు చెడ‌గొడుతోంది. అలా క్యాజువ‌ల్ ష‌ర్ట్ పై వైట్ సూట్ ని ధ‌రించి వ్వావ్ అనిపించింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సింగిల్ ఆల్బ‌మ్స్ లో న‌టిస్తూ.. న‌టిగా బిజీ అవుతోంది.

హార్డ్ వ‌ర్క్ లో త‌న‌కు తానే సాటి!

నటిగా మారిన బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బోనెసి ట్రాక్ రికార్డ్ పెద్ద‌దే. 2011లో అక్షయ్ కుమార్ - జాన్ అబ్రహం నటించిన సూపర్ హిట్ పాట `సుబా హోనే నా దే..` తో తన కెరీర్ ను తిరిగి ప్రారంభించింది. లారిస్సా మొదటి బాలీవుడ్ సినిమా తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకేతోనే సాధ్య‌మైంది. సైఫ్ అలీ ఖాన్‌- రాజ్ అండ్ డీకే క‌ల‌యిక‌లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ మూవీ `గో గోవా గాన్`లో సహాయక పాత్రలో కనిపించింది. లారిస్సా సంచలన గాయకుడు గురు రంధవాతో `సుర్మా సుర్మా` వంటి ప్రధాన హిట్ సాంగ్ లో న‌టించింది. ఆర్ యు కమింగ్ ...డిమ్ డిమ్ లైట్ వంటి అనేక చార్ట్ బ‌స్ట‌ర్ పాటలలో క‌నిపించింది. ఆమె 2016 తెలుగు చిత్రం తిక్క -నెక్స్ట్ ఏంటి లాంటి చిత్రాల్లో క‌నిపించింది. నటి లారిస్సా బొనేసి ఇటీవల TEDx గోల్డెన్ బ్రిడ్జ్ స్వతంత్రంగా నిర్వహించబడిన TED ఈవెంట్ లో కనిపించింది. జీవితం తనపై విసిరిన సవాళ్లన్నింటినీ సానుకూలంగా తీసుకొని వాటిని అందంగా మార్చడం ద్వారా త‌న ప్ర‌యాణాన్ని హార్డ్ వ‌ర్క్ ని వెల్ల‌డించింది. జీవితంలో స్వీయ ప్రేమ ఎంత ముఖ్యమో ప‌దే ప‌దే చెబుతోంది లారిస్సా.

సమాజం అంగీకరించేలా ఏదైనా చేయాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని లారిస్సా చెప్పింది. మీరు ఏది చేయాలనుకుంటే అది చేసేయండి. ప్రతి ఒక్కరికి మీ నిజమైన వ్యక్తిత్వాన్ని చూపించండి. వారు మీ కోసం మిమ్మల్ని అంగీకరించనివ్వండి. నేటి కాలంలో తాదాత్మ్యం ఎంత అవసరమో లారిస్సా చెబుతోంది. మీకు వీలైనప్పుడల్లా సానుభూతి చూపండి.. ఎందుకంటే ప్రపంచానికి ఇది అవసరం అని తెలిపింది. తన అనుభవాల ద్వారా నేర్చుకున్నది .. కోరుకున్నది ఎంతటి కష్టమైనా వదులుకోకూడదు.. అని అంది.

సోషల్ మీడియా దుర్వినియోగం గురించి స్పందిస్తూ.. ప్రతి ఒక్కరికి తెలియకుండా లేదా వారు ఎక్కడి నుండి వచ్చారో తెలియకుండా కూడా ప్రజలు ఎంత త్వరగా దుర్భాషలాడారు.. తీర్పు ఇచ్చేస్తారు అనే దాని గురించి ఆవేద‌న‌గా మాట్లాడింది. మ‌నుషుల విష‌యంలో దయగా ఉండండి. సాధ్యమైనప్పుడల్లా దయ -ప్రేమను ప్రతిచోటా వ్యాపింపజేయండి. ముఖ్యంగా ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీరు ఎవరో మీరే అంగీకరించండి.. అని తెలిపింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ పెంట్‌హౌస్ లో ఈ నటి బాబీ డియోల్- అర్జున్ రాంపాల్ లతో కలిసి నటించింది. ప్రముఖ దర్శకుడు అబ్బాస్-మస్తాన్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. త‌దుప‌రి మరో రెండు ప్రాజెక్ట్‌లు సంతకం చేసాను. షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపింది.


Tags:    

Similar News