ధనుష్.. సాయి పల్లవిల రౌడీ బేబీ పాట జోరు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా రెండు సంవత్సరాలు అయినా కూడా యూట్యూబ్ లో ఆ పాట సందడి కొనసాగుతూనే ఉంది. సౌత్ లో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న పాటగా రౌడీ బేబీ క్రెడిట్ దక్కించుకుంది. బిలియన్ వ్యూస్ ను రాబట్టిన సౌత్ వీడియోగా ధనుష్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రౌడీ బేబీ పాట లోని ధనుష్ మరియు సాయి పల్లవిల స్టెప్పులకు కోట్లాది మంది ఫిదా అయ్యారు. రౌడీ బేబీ లాంటి స్టెప్పులను మళ్లీ రిపీట్ చేయాలంటూ ధనుష్ కోరుకుంటున్నాడు. రౌడీ బేబీ పాటకు ప్రభుదేవా మరియు జానీ మాస్టర్ లు కలిసి డాన్స్ ను కంపోజ్ చేశారు. ఈసారి జానీ మాస్టర్ ధనుష్ తో కొత్త స్టెప్పులు వేయిస్తున్నాడు.
ధనుష్ ప్రస్తుతం నటిస్తున్న 'D43' సినిమాలో మరో మాస్ మసాలా సాంగ్ ను పెడుతున్నారు. ఆ పాట కోసం జానీ మరింత మాస్ స్టెప్పులను ధనుష్ తో ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ఇటీవల ధనుష్ తో జానీ మాస్టర్ ప్రాక్టీస్ చేయించిన వీడియో మరియు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరి కాంబోలో ఖచ్చితంగా మరో రౌడీ బేబీ పాట ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. రౌడీ బేబీని క్రాస్ చేయాలంటే మామూలు విషయం కాదు. అయినా కూడా దాన్ని మించేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అంటున్నారు.